Telugu News

రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి పువ్వాడ

నేటి నుండి పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. రైతు ఉత్సవాల్లో ప్రకటించిన మంత్రి పువ్వాడ.

0

నష్టపోయిన రైతులకు రూ.228 కోట్ల ఆర్థిక సాయం..: మంత్రి పువ్వాడ

▪️ఎకరాకు రూ.10వేలు, ఖమ్మం జిల్లాలు రూ.23 కోట్లు..

▪️నేటి నుండి పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. రైతు ఉత్సవాల్లో ప్రకటించిన మంత్రి పువ్వాడ.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు రైతు దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం, రంక్యా తండా రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సంబరాల్లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నష్టపోయిన పంటలకు అర్థిక సహాయంను అందజేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు కేంద్రం సిఫారసుల కంటే అధికంగా ఎకరాకు రూ.10వేలు చొప్పున సహాయ, పునరావాస సాయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆయా సాయం నేటి నుండి రైతులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావంతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ రూ.228 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం ఒక్క కేసీఅర్ కే సాధ్యమన్నారు.

ఇది కూడా చదవండి: రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ

రఘునాథపాలెం మండలంలో  తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని పేర్కొన్నారు. రూ.20 కోట్లతో సుడా పార్క్ పక్కనే పేదల ఉచిత నాణ్యమైన విద్యబ్కోసం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను నిర్మిస్తున్నామని అన్నారు. మండల ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్, ఆసరా పెన్షన్లు, రైతు బందు, రైతు భీమా, ఉచిత విద్యుత్, రైతులకు ఎరువులు, డబుల్ బెడ్ రూం ఇల్లు, విత్తనాలు, చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ ఇలా అనేక పథకాలు విరివిగా అందించిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వందే అన్నారు. ఇవన్నీ మళ్ళీ మనకు అందాలంటే మళ్ళీ కేసీఅర్ గారిని, ఇక్కడ నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ వరకు అద్భుతమైన అభివృద్ది చేసుకున్నాం ఇక చేయాల్సింది రాజకీయాలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారిణి విజయ కుమారి, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, జెడ్పిటిసి ప్రియాంక, క్లస్టర్ పరిధిలోని గ్రామాల సర్పంచులు, పిఏసీఎస్ డైరెక్టర్లు, ఆత్మ, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: దేశానికే తెలంగాణ ఆదర్శం:- మంత్రి పువ్వాడ