ఇసుక మాఫియాకు లీడర్ మంత్రి పువ్వాడ : బీజేపీ
== ఈ మాఫియాను అడ్డగించకుండ మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు
== జిల్లాలో అధికారులంతా నిద్ర పోతున్నారా
== మండిపడిన బీజేపీ మహిళా నాయకురాలు ఉప్పల శారద
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఇసుక మాఫియాకు లీడర్ గా మంత్రి పువ్వాడఅజయ్ కుమార్ ఉన్నారని, ఇసుక దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతుందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఉప్పల శారద ఆరోపించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పట్టపగలే ఇసుక మాఫియా జోరుగా సాగుతుందన్నారు. పోలీసులకు, సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాలు చేసి మొరపెట్టుకున్న ఆపలేకపోయారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: పేపర్ లీకేజ్ కి మంత్రి కేటీఆర్ బాధ్యుడు: బీజేపీ
ఇంత మాఫీయా జరుగుతుంటే ఆ మాఫియాను అడ్డగించకుండ మైనింగ్ ఏ. డీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాలో అధికారులంతా నిద్ర పోతున్నారా..? అని ప్రశ్నించారు. ,ఇసుక మాఫియా అంటే బీఆర్ఎస్ నాయకులేనని, ఆ వ్యాపారంలో ఆరితేరి ఉన్నారని ఆరోపించారు. అధికారులంతా మంత్రికి బంధువులు అయ్యారా..? అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలకు ఇసుక మాఫియా కూడా కారణమని తెలిపారు. బీజేపీ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో రేపు మైనింగ్ ఏ.డీ కార్యాలయ ముట్టడి చేస్తామని, అవసరం అయితే మంత్రి కార్యాలయ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇసుక మాఫియాలో తప్పుకుంటే ప్రజల తరపున మేము పోరాడతామని అన్నారు.