Telugu News

రూ.3.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

భారీగా మోటర్ సైకిల్ ర్యాలీ

0
రూ.3.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ
== భారీగా మోటర్ సైకిల్ ర్యాలీ
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం నగరంలోని 38, 58వ డివిజన్లలో రూ.3.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ఆదివారం సాయంత్రం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 38వ డివిజన్ ఖిల్లాలో సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎల్ఆర్ఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడమైంది. 58వ డివిజన్ వివేకానంద కాలని వద్ద ఎస్డీఎప్ & ఎల్ఆర్ఎస్ నిధులు రూ.2.70కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్స్ మరియు సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడమైనది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
పేదలు ఎక్కువ నివాసం ఉండే ప్రాంతంలో అధిక నిధులు కేటాయించాలని  బలంగా నిర్ణయించుకున్నా.. రానున్న రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్ పరిధికి పేదల నివాసం ఉండే చోటు అనే ప్రాంతం ఉండకూడదు అన్న నిర్ణయం తీసుకున్నాం. ఒకప్పుడు ఒక్కో ఇల్లు ఒక్కో విసిరేసినట్లు ఉండేది.. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.. అంత ఒకే ప్రాంతంగా చూస్తున్నాం. రోడ్లు పూర్తి అయిన చోట  ఇప్పుడు 2.5 కిలో మీటర్ల మేర సైడ్ కాల్వల  నిర్మాణం కోసం నేడు శంకుస్థాపన చేయడమైంది. ఈ ప్రాంతాలు ఒకప్పుడు  పేదలు నివాసం ఉండేవి అని అనేవారు.. కానీ నేడు అద్భుతంగా అభివృద్ది చేసినం. ఇంకా చేస్తాం.. మళ్ళీ నన్ను గెలిపిస్తే మరిన్ని నిధులు ఖమ్మంకు తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. ఖమ్మం నగరంలో అర్ధరాత్రి కూడా పట్ట పగలు ఉండేలా అన్ని ప్రధాన రహదారులు వెలుగులు విరాజిల్లుతుంది. గతంలో ప్రతి రోడ్ల మీద చెత్త ఎప్పుడూ నిరంతరాయంగా పేరుకుపోయి ఉండేది.. తీస్తున్న కొద్ది గుట్టలు గుట్టలు గా వస్తుండేది.. కానీ నేడు పరిస్థితి ఉందా.. ఎక్కడైనా చెత్త నిల్వ ఉంటుందా.. ఎంత కష్టపడితే నేడు ఆ పరిస్థితులను అధిగమించగలిగిన. మున్సిపాలిటీ కి కేవలం 14 చెత్త సేకరణ వాహనాలు ఉంటే నేడు 143 చెత్త వాహనాలు సమకూర్చి ప్రతి డివిజన్ కు ప్రత్యేక చెత్త వాహనాలు ఎర్పాటు చేసి క్లీన్ ఖమ్మంగా మార్చినం.
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్యను ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తూన్నాయి.. చెత్తను ఎవరు నిప్పు పెట్టారో మకు తెలుసు.. అర్థ రాత్రిలో ముసుకులు కప్పుకుని ఎవరు నిప్పు పెట్టారో కూడా మాకు తెలుసు.. ఇలాంటి చిల్లర పనులు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా..సీసీ కెమెరాలు పెట్టినం, పోలీస్, ఫైర్ ఇంజన్ ను పెట్టినం..రానున్న రోజుల్లో డంపింగ్ యార్డ్ సమస్యను అధిగమిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, కార్పొరేటర్ అలియా షౌకత్ ఆలి, ఖామర్, తౌసిఫ్(బాబీ), డివిజన్ నాయకులు, అధికారులు ఉన్నారు.