Telugu News

హోం మంత్రి అలిని కలిసిన మంత్రి పువ్వాడ

మందకృష్ణ మాదిగతో భేటి

0

హోం మంత్రి అలిని కలిసిన మంత్రి పువ్వాడ

== మందకృష్ణ మాదిగతో భేటి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ హోంశాఖ మంత్రి మైముద్ అలీ ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్  ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరును ఖరారు చేయడం పట్ల మంగళవారం హైద్రాబాద్ లోని తన నివాసంలో కలిసి అలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హో మంత్రి అలీ, పువ్వాడ అజయ్ కుమార్ ను ఆశీర్వదించారు. విజయోస్తు, కచ్చితంగా నువ్వే గెలుస్తావని, మూడవ సారి ప్రభుత్వం రావడం ఖాయమని హోమంత్రి అన్నారు.

allso read- మత్య్సకారుల అభివృద్ధే లక్ష్యం: మంత్రి

== మంద కృష్ణ మాదిగని కలిసిన మంత్రి పువ్వాడ.

ఎంఆర్పీఎస్  వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరును ఖరారు చేసిన అనంతరం హైదరాబాద్ కు వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం హైద్రాబాద్ లో మంద కృష్ణ మాదిగని కలిసి మాట్లాడారు.