Telugu News

కొండా లక్ష్మణ్ బాపూజీకి మంత్రి పువ్వాడ ఘన నివాళులు..

హాజరైన ఎంపీలు నామా రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతామధుసూదన్

0

కొండా లక్ష్మణ్ బాపూజీకి మంత్రి పువ్వాడ ఘన నివాళులు..

== హాజరైన ఎంపీలు నామా రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతామధుసూదన్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఘన నివాళులు అర్పించారు.

బుధవారం ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , MP నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, MLC తాత మధుసూదన్, ఎమ్మెల్యే లు బానోత్ హరిప్రియ నాయక్ , రాముల్ నాయక్, మేయర్ నీరజ , పోలీసు కమీషనర్ విష్ణు వారియర్, సుడా చైర్మన్ బచ్చు బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, BC సంఘం నాయకులు తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘట్టించారు.

ఇది కూడా చదవండి: వీరవనిత ఐలమ్మను మరవరాదు: మంత్రి

ఆనతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతోత్సవం కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘట్టించారు.

ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు.

బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను మంత్రి పువ్వాడ స్మరించుకున్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

వారి పోరాట స్ఫూర్తితోనే కేసీఅర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం ను సాధించారని గుర్తు చేశారు.

*కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళి గారు, బొమ్మ రాజేశ్వరరావు, పగడాల నాగరాజు, సంఘం నాయకులు చిలకమర్రి శ్రీనివాస్ బాబు, బెండెం జనార్ధన్, బండారు శ్రీనివాస్, సత్యనారాయణ, పిల్లలమర్రి కొండల రావు, సంపత్, మసురం శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:  ఖమ్మాని వదిలి పెట్టేది లేదు: మంత్రి పువ్వాడ