Telugu News

చిన్నారితో కరాటే చేసిన మంత్రి పువ్వాడ

విద్యార్థులతో కరాటే చేస్తూ సందడి చేసిన మంత్రి

0

చిన్నారితో కరాటే చేసిన మంత్రి పువ్వాడ

== విద్యార్థులతో కరాటే చేస్తూ సందడి చేసిన మంత్రి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అభివద్ది పనులతో, సంక్షేమ పథకాల అమలుతో నిత్యం ప్రజల్లో తిరుగుతూ బిజిబిజిగా ఉండే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ విద్యార్థితో కరాటే అడుతూ నేను పోటీకి సై అన్నారు. విద్యార్థితో కరాటే చేస్తూ సందడి చేశారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రోటరీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ది పనులు ప్రారంభోత్సవంకు హాజరైన సందర్భంగా పాఠశాల మార్షల్ ఆర్ట్స్ విజేత అయిన చిన్నారితో ఇలా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్షల్ విన్యాసం చేశారు. నువ్వా..నేనా సై అంటూ విద్యార్థితో మార్షల్ విన్యాసం  చేస్తూ సందడి చేశారు. దీంతో అక్కడ వేదికపై ఉన్నవారందరు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విద్యార్థితో మాట్లాడారు. ఆయన తల్లిదండ్రులు, విద్యా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరాటే అన్ని పాఠశాలలో విద్యార్థులకు నేర్పించాలని, తద్వారా విద్యార్థులకు తమకు తాము ప్రగాడ విశ్వాసంతో ఉంటారని, అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తారని తెలిపారు. అందువల్ల విద్యార్థులకు ధీరత్వం పెరిగి చదువులు మంచిగా అబ్బే అవకాశం ఉంటుందన్నారు.

ఇది కూడా చదవండి:  పేదలకు నాణ్యమైన విద్య మా బాధ్యత: మంత్రి