చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి పువ్వాడ..
కోటపాడు మచినేని చెరువులో 75వేల చేప పిల్లలను వదిలిన మంత్రి.
చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి పువ్వాడ..*
*▪️కోటపాడు మచినేని చెరువులో 75వేల చేప పిల్లలను వదిలిన మంత్రి.*
*▪️ప్రభుత్వం 100శాతం రాయితీపై జిల్లాలో 551 చెరువులలో 2.02కోట్ల చేప పిల్లల పంపిణి.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోటపడు గ్రామంలోని మాచినేని చెరువులో ప్రభుత్వం పంపిణీ చేసిన 75వేల చేప పిల్లలు(రోహు, మ్రిగాల, కట్ల రకాల చేప పిల్లలు)ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ V.P.గౌతమ్ గారు చెరువులో వదిలారు.
ఇది కూడా చదవండి: పాలేరు కు మరో రైల్వేలైన్
ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేశారని, నాడు చేపలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు ఎగుమతి చేసుకునే స్థాయికి వెళ్లామన్నారు.ఇదంతా సీఎం కేసీఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు. నిరంతరం తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు మనమంతా అండగా నిలబడాలన్నారు.
రైతు బీమా, పెట్టుబడి సాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసం ప్రభుత్వం రాయితీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి పువ్వాడ మరోసారి గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో చేపలను విక్రయించడానికి వాహనాలను రాయితీపై ఇచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదన్నారు.
ఇది కూడా చదవండి: తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..?: మంత్రి
నీలి విప్లవంను ప్రోత్సహించేందుకు కేసీఅర్ గారు మత్స్యసంపదను పోటీపడి సంపదను సృష్టిస్తున్నరని అన్నారు. సీఎం కేసీఆర్ గారు మత్యకారుల మోముల్లో సంతోషం నింపారని, సబ్బండ వర్గాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలిచామన్నారు.
ఖమ్మం జిల్లాలో సహజ నీటి వనరులపై ఆధారపడి నేటివరకూ జిల్లాలో 186 సహకార సంఘాల నమోదు అయ్యాయన్నారు. ప్రాథమిక సంఘాలు 143, మహిళ సంఘాలు 30, హరిజన సంఘాలు 6, గిరిజన సంఘాలలో 14031 మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పించామన్నారు.ప్రభుత్వం 100శాతం రాయితీపై ఖమ్మం జిల్లాలో 551 చెరువులలో 2.02కోట్ల చేప పిల్లలను ఆయా చెరువుల్లో వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.