కె.విశ్వనాథ్ మృతి పట్ల మంత్రి పువ్వాడ అశ్రు నివాళి..
== తెలుగు సినిపరిశ్రమకే గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తి విశ్వనాథ్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి మరణం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని మంత్రి పువ్వాడ కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకువచ్చాన్నారు.
ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసకువచ్చారన్నారు.
సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఆయన చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయని, విశ్వనాథ్ గారి మహాభినిష్క్రమనం తెలుగు సినీరంగానికి తీరని లోటని వారు అన్నారు.
విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు
ఇది కూడా చదవండి: కార్పొరేట్ కు దీటుగా సర్కార్ స్కూళ్ల అభివృద్ధి:మంత్రి