Telugu News

ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి​ పువ్వాడ అజయ్ అభినందనలు

విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం

0
ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి​ పువ్వాడ అజయ్ అభినందనలు
★ విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం
(ఖమ్మం-విజయంన్యూస్)
పీఎస్‌ఎల్‌వీ సీ-54 పరికరము (రాకెట్‌) ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేసి, భవిష్యత్తులో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయాలు సాధించాలని మంత్రి అజయ్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఓషన్‌ శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణం పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం. మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఆరోగ్య తెలంగాణే లక్ష్యం:మంత్రి పువ్వాడ.