సైంటిస్ట్ ఉమా మహేశ్వరరావు ను సత్కరించిన మంత్రి పువ్వాడ..
జిల్లాకే గొప్ప పేరు తెచ్చావంటూ కొనియాడిన మంత్రి
సైంటిస్ట్ ఉమా మహేశ్వరరావు ను సత్కరించిన మంత్రి పువ్వాడ..
== జిల్లాకే గొప్ప పేరు తెచ్చావంటూ కొనియాడిన మంత్రి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో ఖమ్మానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త వల్లూరు ఉమామహేశ్వర రావు ఆపరేషన్ మేనేజర్‌గా పాల్గొనడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.ఇలా దేశం గర్వించదగ్గ ప్రయోగంలో ఖమ్మం యువకుడు ISRO చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగం కావడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా.. యావత్ తెలుగు ప్రజలకే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సత్కరించారు. దేశం గర్వించే ప్రయోగంలో భాగస్వామ్యం కావడం పట్ల వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ తదితరులు ఉన్నారు
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్: మంత్రి హరీష్