Telugu News

ఖమ్మం మున్నేరు బ్రిడ్జి పై మంత్రి పువ్వాడ సమీక్ష..

పనులు ప్రారంభించాలని రవాణాశాఖ అధికారులను కోరిన మంత్రి

0

ఖమ్మం మున్నేరు బ్రిడ్జి పై మంత్రి పువ్వాడ సమీక్ష..

== పనులు ప్రారంభించాలని రవాణాశాఖ అధికారులను కోరిన మంత్రి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరం మున్నేరుపై నిర్మించనున్న కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల గూర్చి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సెకరటేరియట్ లోని ఆయన పేశి నందు రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ విజెంద్ర బోయి, ఈఎన్ సీ రవీందర్ రావులతో సమీక్షించారు. మున్నేరుపై నిర్మించనున్న ఈ బ్రిడ్జి దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి తరహాలోనే ఉండనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను మంత్రి పువ్వాడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని హామినిచ్చారు.

ఇది కూడా చదవండి: గిరిజనులకు శుభవార్త చెప్పిన సీఎం