*ప్రజలకు మరింత చేరువగా మంత్రి పువ్వాడ
క్యాంప్ కార్యాలయంలో వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి అజయ్.
*ప్రజలకు మరింత చేరువగా మంత్రి పువ్వాడ..*
▪️పువ్వాడ సోషల్ మీడియాలో మరో కలికితురాయి.
▪️క్యాంప్ కార్యాలయంలో వెబ్సైట్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి అజయ్.
(ఖమ్మం -విజయం న్యూస్)
ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇక ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వారియ్యర్స్ అధ్వర్యంలో రూపొందించిన వెబ్ సైట్ ను ప్రారంభించారు.
దీంతో సోషల్ మీడియా రంగంలో మరో కలికితురాయి ఆవిష్కృతం అయ్యింది.
Allso read:- పాలేరు నియోజకవర్గంలో 36 నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరు
ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియచెప్పేందుకు పలు అభివృద్ధి పనులు పొందుపరచిన ఫోటోలు, వీడియోలతో నగర ప్రజలకు చేరువ అయ్యే విధంగా వెబ్సైట్ ను రూపొందించారు.
ఈ వెబ్సైట్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
WWW.PuvvadaAjayKumar.Com నందు మంత్రి పువ్వాడ బయోగ్రఫీ తో పాటు దాదాపు 2వేల కోట్లతో ఖమ్మం అభివృద్ధి కార్యక్రమాల వివరాలను దానిలో పొందుపర్చారు.
Allso read:- జర్నలిస్టుల రుణం తీర్చుకుంటా: మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించిన పూర్తి పర్యటన వివరాలను, ఇప్పటి వరకు చేసిన అభివృద్ది పనులు దానిలో పొందుపరిచారు.
రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో తమ అభివృధ్ధి దూకుడు పెంచి, ప్రజలుకు మరింత దెగ్గర అయ్యేందుకు వెబ్సైట్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
అనంతరం సోషల్ మీడియా ఫ్లాట్ ఫర్మ్ కి సంబంధించిన “పువ్వాడ దండు” పేరుతో రూపొందించిన లోగో ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.