నూతన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి పువ్వాడ..
== ఆశీర్వదించిన పువ్వాడ తల్లిదండ్రులు
== అభినందించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఐడవ అంతస్తులోని తన ఛాంబర్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సీట్లో ఆసీనులయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు, సీపీఐ సీనియర్ నాయకులు, మంత్రి పువ్వాడ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు, తల్లి విజయలక్ష్మి, తనయుడు డాక్టర్ నయన్ లతో కలసి ప్రత్యేక పూజ నిర్వచించారు. వేద పండితులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు వేద మంత్రోత్సవాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
allso read- పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన సచివాలయం: మంత్రి పువ్వాడ
తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర ఘట్టంలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిర్మించారని మంత్రి పువ్వాడ అభివర్ణించారు. ఈ శుభ సందర్బంగా యావత్ తెలంగాణ ప్రజలకు, రవాణా, ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరిని మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మేల్యేలు వనమా వెంకటేశ్వర రావు, రాములు నాయక్, హరిప్రియ నాయక్, జిల్లా కలెక్టర్ వీ.పి గౌతమ్, ఆర్టీసీ ఎం.డీ సజ్జనార్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పి చైర్మన్ కమల్ రాజ్, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతామాలక్ష్మీ, డీవీ, వివిధ మున్సిపల్ సంస్ధల చైర్మన్ లు, అధికారులు తదితరులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
allso read- పువ్వాడ ను కలిసిన తమ్మినేని..ఎందుకోసమంటే..?