18 న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మానం
== 200 ల కార్ల తో కాల్వోడ్డు నుంచి భారీ ప్రదర్శన == ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు
18 న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మానం
== 200 ల కార్ల తో కాల్వోడ్డు నుంచి భారీ ప్రదర్శన
== ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు
(ఖమ్మం-విజయంన్యూస్)
ఈనెల 18న రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చాంబర్ ఆప్ కామర్స్, ఉద్యోగ జేఏసీ, ప్రజాసంఘాల జేఏసీ, పౌరసమితి ఆధ్వర్యంలో పౌరసన్మానం చేస్తున్నట్లు ఆ సంఘాల బాధ్యులు తెలిపారు. శుక్రవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఛాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, ప్రజాసంఘాల కన్వీనర్ షేక్.అప్జల్ హసన్,పౌరసేవా సమితి అధ్యక్షులు పులిపాటి ప్రసాద్ మాట్లాడారు.
ఈ నెల 19 న
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 18న ఖమ్మం నగరం గాంధీ చౌక్ కూడలి లో ఛాంబర్ ఆఫ్ కామర్స్,ఉద్యోగ జేఏసీ, ప్రజా సంఘాల భాగస్వామ్యం తో పౌర సమితి ఆధ్వర్యంలో పౌర సన్మానం నిర్వహించనున్నట్లు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఈ నెల19 న సీఎం కేసీఆర్ ను మంత్రి కలిసి యాదాద్రి నరసింహస్వామి ఆలయం కు కేజీ బంగారం ను వితరణ చేయనున్నట్లు చెప్పారు.ఈ నెల 18 న నయా బజార్ సెంటర్ నుంచి పీఎస్ఆర్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ వరకు 200 ల వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.రాజకీయాలకు అతీతంగా జరిగే పౌర సన్మానంకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఖమ్మం జిల్లాను రూ.15 కోట్ల నిధులు వెచ్చించి మంత్రి ఆధునికరించడమే కాకుండా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని అన్నారు.ఛాంబర్ ఆఫ్ కామర్స్,హమాలి, త్రీ టౌన్ ప్రజల విజ్ఞప్తి మేరకు వ్యవసాయ మార్కెట్ ను వేరే ప్రాంతం కు తరలించకుండా మంత్రి పువ్వాడ అజయ్ నిలుపుదల చేయడంలో కీలక పాత్ర వహించారన్నారు.అదేవిధంగా గోళ్లపాడు ఛానల్,లకారం ట్యా0క్ బండ్,మ్యూజికల్ ఫౌంటెన్,తీగల వంతెన,వాక్ వే లను ఏర్పాటు చేసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనదైన అభివృద్ధి ముద్ర వేశారని చెప్పారు.టీఎన్జీవో,టీజీవో,పంచాయతీ రాజ్,డ్రైవర్ల సంఘం,నాల్గవతరగతి ఉద్యోగులు,ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రి అజయ్ కుమార్ కు జరిగే పౌర సన్మానం ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
also read :-18న ఖమ్మానికి మంత్రి కేటీఆర్
also read :- జిల్లాలో పొంగులేటి ముమ్మర పర్యటన
ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు కొప్పు నరేష్,జనరల్ సెక్రెటరీ గోడవర్తి శ్రీనివాసరావు, కిరాణా జాగిరి మార్చంట్స్ అసోసియేషన్ వేములపల్లి వెంకటేశ్వర్లు,కోశాధికారి తూములూరి లక్ష్మీ నరసింహారావు, ఉపాధ్యక్షులు పత్తి పాకా రమేష్,సహాయ కార్యదర్శి కురువెళ్ల కాంతారావు,వెండి,బంగారం అధ్యక్ష,కార్యదర్శులు బంధు సూర్యం,సతీష్, మన్నెం కృష్ణ,టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్, డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హకీమ్,జానిమియా,నాల్గవతరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య లు పాల్గొన్నారు.