Telugu News

హైదరాబాద్ పయనమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్

 వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య

0

హైదరాబాద్ పయనమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్

==  వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో అధికార పర్యటన ముగించుకుని హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరిన మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి,నామా నాగేశ్వరరావులకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీడ్కోలు పలికారు.హైదరాబాద్ నుంచి  మంత్రి,ఎంపీలు హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకుని మొదట గ్రీన్ ఫీల్డ్ మినీ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించి, అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు.అనంతరం వేంసూరు మండలంలోని వెంకటాపురంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, పార్థసారథి రెడ్డి తోడల్లుడు,ఆ గ్రామానికి చెందిన జయరాం రెడ్డి ఇటీవల మృతి చెందగా,ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అటుతర్వాత అతిథులు మధ్యాహ్న భోజనం ముగించుకుని సత్తుపల్లి మండలం జీ.గంగారంలో సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం సత్తుపల్లి పట్టణంలోని జలగం వెంగళరావు స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణకు చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ పయనమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి,ఎంపీలకు ఎమ్మెల్యే వెంకటవీరయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు వీడ్కోలు పలికారు.

allso read- క్రీడాలను ప్రోత్సంహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి శ్రీనివాస్ గౌడ్