Telugu News

రామసహాయం వెంకట్ రెడ్డిని పరామర్శించిన మంత్రి తుమ్మల

రామసహాయం పద్మమ్మ చిత్రపటానికి నివాళ్ళు అర్పించిన మంత్రి

0

రామసహాయం వెంకట్ రెడ్డిని పరామర్శించిన మంత్రి తుమ్మల

==  రామసహాయం పద్మమ్మ చిత్రపటానికి నివాళ్ళు అర్పించిన మంత్రి

(పోచారం, కూసుమంచి -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

కూసుమంచి మండలం పోచారం గ్రామం లో మాజీ ఎంపీపీ రామసహాయం వెంకట్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరామర్శించారు. వెంకట్ రెడ్డి తల్లి గారైన రామసహాయం పద్మమ్మ ఆదివారం మరణించిన విషయం తెలుసుకున్న ‌మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం గ్రామానికి వెళ్ళి వెంకట్. రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.