అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి పువ్వాడ
== మౌళిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం మంజూరైన CSR నిధులు..*
== రూ.2.40 కోట్ల విలువైన చెక్కును కలెక్టర్ కు అందజేసిన మంత్రి పువ్వాడ.*
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గతంలో రూ.2 కొట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఆయా నిధులతో అనేక పనులు, డొంక రోడ్లు ఎర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇదికూడా చదవండి:- వాడ వాడ కు కదిలిన పువ్వాడ..
మండలంలో మిగిలి ఉన్న డొంక రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం మండల రైతుల అభ్యర్థన మేరకు స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రత్యేక చొరవ చూపించి TRANSCO శాఖ CSR ఫండ్స్ ద్వారా రూ.2.40 కోట్లు మంజురు చేయించారు.
ఆయా విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు గురువారం స్వయంగా అందజేశారు.
ఇది కూడా చదవండి:-తెలంగాణ దేశానికే మోడల్: మంత్రి నిరంజన్ రెడ్డి
రైతుల విజ్ఞప్తి మేరకు మంజూరైన ఆయా నిధులు మండలంలోని అభివృద్ధి పనులకు వినియోగించాలని సూచించారు.