Telugu News

ఖమ్మంలో ఓటేసిన మంత్రి..ఎంపీ.

** ఆయా పోలింగ్ కేంద్రంలో ఓటేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

0

ఖమ్మంలో ఓటేసిన మంత్రి..ఎంపీ
** ఆయా పోలింగ్ కేంద్రంలో ఓటేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
(ఖమ్మం ప్రతినిధి –విజయం న్యూస్):-

ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జరిగిన పోలింగ్ కు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్,ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం మేయర్ పూనకొల్లు నీరజ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఆర్డీవో కార్యాయలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాచంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భద్రాచంలో ఎమ్మెల్యే పోదేం వీరయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్తూనే అందరికి అభివాదం చేస్తూ వెళ్లారు. అందర్ని అప్యాయంగా పలకరించారు. నామా నాగేశ్వరరావు స్వయంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టగానే అడిగి మరి శానిటైజ్ చేయించుకున్నారు.

also read :-సతులకు బదులు పతులు.