గాయత్రి రవి నివాసంలో మంత్రుల విందు భోజనం
(ఖమ్మం విజయం న్యూస్):-
ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర సివిల్ సప్లయిస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) విందు భోజనం ఏర్పాటు చేశారు. బీసీ భవన్ ఆవిష్కరించిన అనంతరం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష ముగించుకుని మంత్రులు కమలాకర్, అజయ్ కుమార్ లు నేరుగా గాయత్రి రవి నివాసానికి వెళ్లారు. మంత్రులకు గాయత్రి రవి తనయుడు నిఖిల్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
also read;-మంత్రి అజయ్ తో టీఆర్ఎస్ నాయకుల సమావేశం
అనంతరం మంత్రులతో భోజనం ముగించుకుని.. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, నాయకులు ఆర్జేసి కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, దిండిగాల రాజేందర్, బీసీ సంఘాల నాయకులు పాల్వంచ రామారావు, ఆకుల గాంధీ తదితరులు పాల్గొన్నారు.\