*ఖమ్మం బయలుదేరిన మంత్రులు కేటీఆర్,ప్రశాంత్..*
== నాలుగు నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటన
== మంత్రులతో పాటు బయలుదేరిన ఎంపీ వద్దిరాజు ఎంపీలు నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డి
(హైదరాబాద్ -విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా పర్యటన భాగంగా రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఖమ్మం కు బయలుదేరారు.
ఇది కూడా చదవండి:- నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’
వారితో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డిలతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం హెలికాప్టర్ లో ఖమ్మం బయలుదేరారు.ఎంపీలతో కలిసి మంత్రులు ఖమ్మం, సత్తుపల్లి,భద్రాచలంలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సత్తుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగసభలో మంత్రులు, ఎంపీలు ప్రసంగిస్తారు.
ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు లేనట్లే..?