Telugu News

ఖమ్మం లో మంత్రులకు నిరసన సెగ

మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫారెస్ట్ అధికారులు

0

ఖమ్మం లో మంత్రులకు నిరసన సెగ

== మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫారెస్ట్ అధికారులు

== మాకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు

== ఎఫ్ఆర్వో శ్రీనివాస్ అంత్యక్రియలు జరుగుతుండగానే నిరసన

== మాట్లాడకుండానే వెనుదిరిగి పోయిన ఇద్దరు మంత్రులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ అంత్యక్రియలు హాజరైన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మీతా సబర్వాల్, హారితహారం ఓఎస్డీ ప్రియాంక ఒర్గీస్ హాజరుకావడంతో ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ చలమల శ్రీనివాస్ హత్య జరిగిన సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వందలాధి మంది ఫారెస్ట్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు అంత్యక్రియల కార్యక్రమంలో హాజరైయ్యారు.

Allso read:- అశ్రునయనాలతో శ్రీనివాసరావుకు అంతిమ వీడ్కోలు..

సుమారు 1500 మంది ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అయితే అంతిమయాత్ర ప్రారంభం నుంచి ఫారెస్ట్ అధికారులు ఒక్కటే నినాదంతో ముందుకు వెళ్లున్నారు. గుత్తికోయలను తెలంగాణ నుంచి తరిమేయాలని, శ్రీనివాస్ ను హత్యచేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫారెస్ట్ అధికారులకు వెపన్స్ ఇవ్వాలని, లేదంటే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీనివాస్ ఇంటి సమీపంలో ఉదయం8గంటల నుంచి ఫారెస్ట్ అధికారులు నల్లబ్యాడ్జీలను పెట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వూయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఫారెస్ట్ అధికారులకు కచ్చితంగా వెపెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అంతిమయాత్ర పూర్తయ్యే వరేకు నిసబ్దం పాటించినప్పటికి చివరి సమయంలో ఫారెస్ట్ అధికారులు ఒక్కసారిగా మంత్రులను ముట్టడి చేసేందుకు ప్రయత్నం చేశారు. మాకు ప్రొటక్షన్ కావాలని డిమాండ్ చేశారు.

== విధులను బహిష్కరిస్తున్నాం: ఫారెస్ట్ అధికారులు

ఫారెస్టు అధికారులకు కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం భద్రతకల్పించాలని, ఫారెస్ట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి వెప్పన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు శ్రీనివాస్ అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన హామినివ్వకపోతే గురువారం నుంచే విధులను నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి హెచ్చరించారు.ఫా

allso read:-రెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య

దీంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు, బందువుల నివాసాల్లో ఫారెస్ట్ అధికారులు పై దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. స్వేచ్చగా పనిచేయాలంటే భయమేస్తోందని అన్నారు. అందుకే ప్రభుత్వమో, మంత్రులు ఇక్కడే మాకు న్యాయం చేయాలని, ఏదో ఒక్కటి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గురువారం నుంచి వీధులను బహిష్కరిస్తామని తెలిపారు.

== మంత్రులకు నిరసన

శ్రీనివాస్ రావు అంత్యక్రియల్  అనంతరం టెంట్ వద్ద కుర్చున్న మంత్రులను ఫారెస్ట్ అధికారులు ముట్టడించే

allso read:- ఎఫ్ఆర్వో కుటుంబానికి వద్దిరాజు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అవకాశం ఉండటంలో పోలీసులు ఫారెస్ట్ అధికారులను టెంట్ వద్దకు రాకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో మంత్రులకు నిసరన ఎదురైంది. కాగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో మాట్లాడ ప్రయత్నం చేయగా, ఫారెస్ట్ అధికారులు అంగీకరించాలేదు. దీంతో మంత్రులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.