నందిగామలో మంత్రి పువ్వాడ పర్యటన
== శ్రీ సత్యసత్యమ్మ దేవాలయంలో పూజలు చేసిన మంత్రి
== ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఇటీవలే తన చిన్న కుమారుడి వివాహ నిశ్ఛయతాంబుల కార్యక్రమం జరగ్గా, అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆదివారం నందిగామ నియోజకవర్గంలోని అంబారుపేట లోని శ్రీ సత్య సత్యమ్మ అమ్మ వారి దేవస్థానం నందు అమ్మ వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్-వసంత లక్ష్మీ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మంత్రి పువ్వాడ దంపతులకు సాదర స్వాగతం పలికారు. దేవస్థానం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని అమ్మవారిని వారిని వేడుకున్నారు. ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రావు, ఈఓ నాగరాజు లు మంత్రి దంపతులకు శాలువాలతో సత్కరించారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే సండ్ర ఇళ్లు పాయే