ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి…..
(ఖమ్మం విజయం న్యూస్);-
ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 43 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.
also read;-అతి చౌకప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా వ్యవస్థ అమలు చేయడానికి కి.మీ కి ₹2కోట్లు అవుతూ
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల పనితీరును ప్రభుత్వం గుర్తించడం వల్లే 4జి స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డులను పంపిణీ చేసున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో ఆశా కార్యకర్తల పనితీరు మరువలేనిదని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో 1500 కూడా లేని ఆశా వర్కర్ల జీతాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9,750 రూపాయలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని న్నారు. తెలంగాణ ప్రభుత్వం కష్టపడి పని చేసిన వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
please subscribe this chanel smiling chaithu;-