Telugu News

సర్కారి గడిలో రాజకీయ గలాట

ప్రజా నిలయంలో రాజకీయ పార్టీల సమావేశాలు

0

సర్కారి గడిలో రాజకీయ గలాటా
** రాజకీయ వేదికగా మారిన ప్రజాసంక్షేమ నిలయాలు
** రాజకీయ మీటింగ్ లు.. సమావేశాలు అందులోనే
** సర్కార్ నిబంధనలు హుష్ కాక్
** పట్టించుకుని అధికార యంత్రాంగం

అది ఒక సర్కారి నిలయం.. ప్రజా సంక్షేమానికి దేవాలయం.. నియోజకవర్గ ప్రజల అవసరాలను పరిష్కరించేందుకు నిర్మాణం చేసిన అధికారిక కార్యాలయం.. పార్టీలకు అతీతంగా ప్రజలందరికి ఎల్లప్పుడు స్వాగతం పలికే స్థానిక సచివాలయం.. అలాంటి సచివాలయం నేడు ఒక పార్టీ వేదికగా మారింది.. పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటూ ప్రజా అవసరాల వేదికగా ఉండాల్సిన ఆ కార్యాలయాన్ని కాస్తా పార్టీ ఆఫీసుగా మార్చేస్తున్నారు.. పార్టీ పదవుల పంచేందుకు మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.. అక్కడే గుద్దులాడుకుంటున్నారు.. తోపులాడుకుంటున్నారు.. వ్యక్తిగతాలను.. బల నిరూపణ కోసం ఆ కార్యాలయాన్ని పావుగా వాడుకుంటున్నారు.. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.. ఫలితంగా ప్రజా సచివాలయం కాస్తా పార్టీ సచివాలయంగా మారింది.. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే వీలు లేకుండా చేస్తున్నారు.. ఇతర పార్టీల నాయకులు ఆ కార్యాలయంలోకి అడుగుపెట్టలేకపోతున్నారు. అసలు ఆ కార్యాలయమేంటి..? ఎందుకు సర్కారి కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారు.. అసలు సంగతేంటో పూర్తిగా చదవుదాం

(కూసుమంచి –విజయం న్యూస్)
గతంలో ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంగా సర్కారి వారి కార్యాలయాలు ఉండేవి.. అక్కడ ఆ ప్రజాప్రతినిధికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగిని వ్యక్తిగత అనుచరుడిగా నియమించి, పార్టీలకు అతీతంగా ప్రజా అవసరాలను తీర్చేందుకు ఉపయోగించేవారు.. ప్రజల అవసరాల కోసం చాలా మంది ప్రజాప్రతినిధులు స్థానిక నియోజకవర్గాల్లో వ్యక్తిగత కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే వారు. ఆ కార్యాలయాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించేవారు. ప్రజలు, ఇతర పార్టీ నేతలు ప్రజాప్రతినిధులతో ఎదైనా అవసరం ఉంటే జిల్లా కేంద్రంలో ఉన్న క్యాంఫ్ కార్యాలయానికి వెళ్ళి ప్రజాప్రతినిధిని కలిసి సమస్యను వివరించేవారు. ప్రజాప్రతినిధులు కూడా వాటిని పరిష్కరించేందుకు కృషి చేసేవారు.
నియోజకవర్గ కేంద్రాల్లో సర్కారి వారి కార్యాలయాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత సీఎం కేసీఆర్ కొన్ని సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్యాంఫ్ కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లో ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ప్రజలు అంత దూరం వారి సమస్యలను చెప్పుకునేందుకు వెళ్లలేకపోతున్నారని సీఎం కేసీఆర్ సమూలమైన మార్పుకు నాంధి పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యులకు ప్రజాసచివాలయం ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 2016 సంవత్సరంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా అమోదం లభించింది. ప్రజలు, పార్టీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ నిర్ణయాన్ని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో శాసనసభ్యుని ప్రజా వేదికలు( నియోజకవర్గ సచివాలయాలు) నిర్మాణం జరిగాయి. ఆ సచివాలయాలపై సీఎం కేసీఆర్ 2016లో అసెంబ్లీలో మాట్లాడుతూ అవి ప్రజా వేదికలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలు, అందరిని ఆహ్వానించే దేవాలయం, అక్కడ పార్టీ సమావేశాలకు అవకాశం లేదని స్పష్టంగా తెల్చి చెప్పారు. ఆ విధమైన ఆలోచనతోనే ఈ కార్యాలయాలు నిర్మాణం జరిగింది. భవనాలు ప్రారంభం తరువాత కూడా చాలా మంది శాసనసభ్యులు ప్రజా నిలయంగానే చూశారు. పార్టీకి, పార్టీ సమావేశాలకు ఆ క్యాంఫ్ కార్యాలయాన్ని దూరంగా ఉంచారు. కానీ ఇప్పుడు..?
** పార్టీ కార్యక్రమాలకు నిలయంగా ..?
ప్రజల అవసరాల కోసం నిర్మాణం చేసిన శాసనసభ్యుని క్యాంఫ్ కార్యాలయ భవనం పార్టీ కార్యక్రమాలకు నిలయంగా మారాయి. ప్రజా సమావేశాలు, ప్రభుత్వ సమావేశాలను మాత్రమే ఆ కార్యాలయంలో నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ బలోపేతంకు సంబంధించిన కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు, పార్టీ నాయకులు రాజకీయ పక్షమైన సమావేశాలు, రాజకీయ పక్షమైన పత్రిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా, అన్నింటిలో శాసనసభ క్యాంఫ్ కార్యాలయం ప్రారంభమైయ్యాయి.అయితే అందులో చాలామంది శాసనసభ క్యాంఫ్ కార్యాలయాలు ప్రజా అవసరాల కోసం ఉపయోగపడుతుండగా, కొన్ని క్యాంఫ్ కార్యాలయాల్లో మాత్రం చాలా వరకు పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్టీ మీటింగ్ లు అందులోనే నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం, పార్టీ సభ్యత్వాలు, నాయకుల బర్తీడేలు ఆ క్యాంఫ్ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. కొన్ని క్యాంఫ్ కార్యాలయాల్లో టీఆర్ఎస్ జెండాలను అవిష్కరిస్తున్న పరిస్థితి నేలకొంది. అంతే కాదు పార్టీ తరుపున నాయకులు ప్రెస్ మీట్లను ఏర్పాటు చేస్తున్నారు.

all so read :- గుర్వాయిగూడెం రామాలయం లో చోరీ
** నిబంధనలు తూచ్
శాసనసభ నియోజకవర్గ క్యాంఫ్ కార్యాలయాల్లో కచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. నూటికి నూరు శాతం సర్కార్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలి. ఎట్టిపరిస్థితుల్లో రాజకీయ కోణంతో కూడిన కార్యక్రమాలను నిర్వహించకూడదు. ఏ పార్టీ తరుపున ఎమ్మెల్యే ఉన్నప్పటికి ఆయన పార్టీకి సంబంధించిన కార్య్రకమాలు చేయకూడదు. కానీ చాలా మంది శాసనసభ్యులు, వారి అనుచరులు, పార్టీ నాయకులు వారి కి సంబంధించిన పార్టీ కార్యక్రమాలను శాసనమండలి క్యాంఫ్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. పార్టీ మీటింగ్ లు, పార్టీ తరుపున పత్రిక సమావేశాలు, పార్టీ బలోపేతం పై సమీక్షలు చేస్తున్నారు. తద్వారా సీఎం కేసీఆర్ నియమించిన నిబంధనలు శాసనసభ్యులు అతిక్రమిస్తున్నారు. అడిగే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా క్యాంఫ్ కార్యాలయాలను వినియోగించుకుంటున్నారు. శాసనసభ్యుడికి ఆయన పదవిలో ఉన్నంతకాలం పాటే ఆ భవనంలోఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆ క్యాంఫ్ కార్యాలయం ప్రజలదే అవుతుంది. ఆ తరువాత గెలిచే శాసనసభ్యుడిది అవుతుంది. అది తెలిసి కూడా చాలా మంది శాసనసభ్యులు వారికి సర్కార్ కేటాయించిన క్యాంఫ్ కార్యాలయాన్ని ఇష్టానుసారంగా పార్టీ సమావేశాలకు వినియోగిస్తున్నారు.
కూసుమంచిలో పార్టీ సమావేశాలన్ని అందులోనే
కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న శాసనసభ్యడికి కేటాయించిన క్యాంఫ్ కార్యాలయంలోనే టీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కందాళ ఉపేందర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికైన తొలినాటి రోజుల్లో కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పుడు ఏ మాత్రం పార్టీ కార్యక్రమాలకు ఆ కార్యాలయాన్ని ఉపయోగించలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తరువాత ఆ కార్యాలయం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మారిపోయింది. పార్టీ నాయకులు అందులోనే పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే సభ్యత్వ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా అందులోనే నిర్వహించారు. అలాగే పార్టీల పదవుల ఎంపిక కోసం నిర్వహించిన సమీక్షసమావేశం కూడా అక్కడే నిర్వహించారు.
క్యాంఫ్ కార్యాలయంలోనే నేతల తన్నులాటా..?
శాసనసభ్యుడి క్యాంఫ్ కార్యాలయంలో పార్టీకి సంబంధించిన సమావేశాలు, పత్రిక సమావేశాలు నిర్వహించకూడదు. కానీ పాలేరు నియోజకవర్గ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే పార్టీ పదవుల పంపకాలపై పత్రిక విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలోనే రెండు వర్గాలుగా విడిపోయిన టీఆర్ఎస్ నాయకులు క్యాంఫ్ కార్యాలయంలోనే తన్నుకున్నారు. ఆ తరువాత మండల పరిషత్ సమావేశం సర్కార్ కార్యాలయంలో జరుగుతుండగా, ఆ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రెండు కూడా సర్కార్ ఏర్పాటు చేసిన కార్యాలయాలు, ప్రజా వేదికలు, ప్రజా సమస్యల పరిష్కార నిలయాలు. వాటిని టీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయాలు మార్చేశారు. ఈ విషయంపై సర్వత్ర విమ్మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను స్వంత పార్టీ కోసం వినియోగించుకోవడం ఏంటని నేటిజన్లు పార్టీ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

all so read :- టీఆర్ఎస్ లో డిష్యూ.. డిష్యూం
** పట్టించుకుని అధికారులు
ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చేసి సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే, వాటిని నివారించాల్సిన అధికారులు అంతా చూస్తూ నిమ్మకుంటున్నారు. తద్వరా అధికారులపై ప్రజలకు ఉన్నసన్నగిల్లుతుంది. నైతిక బాధ్యత తగ్గుతుందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు సర్కార్ కార్యాలయాల్లో సమావేశాలు కాకుండా చూడగలరని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.