రాజుపేట బజార్ సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి
సర్పంచ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందాళ
రాజుపేట బజార్ సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి
== సర్పంచ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందాళ
== గుండెపోటుతో అకాల మరణంతో చింతిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే
(కూసుమంచి-విజయం న్యూస్)
కూసుమంచి మండలం రాజుపేట బజార్ గ్రామ సర్పంచ్ మండవ వెంకటేశ్వర్లు మృతి పట్ల *పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి* తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూసుమంచి మండలం రాజుపేట బజార్ పంచాయతీ సర్పంచ్ మండవ వెంకటేశ్వర్లు గురువారం ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందారు.
ఇది కూడా చదవండి: కూసుమంచి రామాలయ నిర్మాణానికి కందాళ రూ40లక్షల వితరణ
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆయన స్వగ్రామ సర్పంచ్ కావడంతో దిగ్ర్భాంతికి గురైయ్యారు. సమాచారం తెలియగానే హుటాహుటిన రాజుపేట బజార్ కు చేరుకుని సర్పంచ్ మండవ వెంకటేశ్వరరావు పార్థివదేహానికి పూలమాలలువేసి,నివాళులర్పించారు.,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సర్పంచ్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.