మున్నేరులో ఎమ్మెల్యే ఈత సరదా
== ఈత కొట్టి సేదతీరిన ఎమ్మెల్యే కందాళ…
(ఖమ్మంరూరల్-విజయంన్యూస్)
ఒక వైపు మండిపోతున్న ఎండలు.. మరో వైపు ఉక్కపోత.. ఈ క్రమంలో ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సరదా,సరదాగా గడిపారు. ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప నందు మున్నేరులో నీటిని చూసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సరదాగా కాసేపు ఈతకొట్టాలని భావించారు. నాయకులతో కలిసి మున్నేరులోకి వెళ్లిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సరదాగా కాసేపు అలాగా ఈత కొట్టి సందడి చేశారు. ఈత కొట్టిన సమయంలో చిన్ననాటి జ్జాపకాలను గుర్తు చేసుకున్నారు. పక్కనే ఉన్న నాయకులకు చిన్ననాటి జ్జాపకాలను చెప్పారు. గంట పాటు మున్నేరులో ఈతకొట్టిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎండల సమయంలో నీటిలో ఈత కొట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి: ముత్యాలగూడెంలో ఏం జరుగుతోంది..?