Telugu News

జీళ్లచెరువులో సిసి రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ

0

జీళ్లచెరువులో సిసి రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ

== శివాలయంలో ప్రత్యేక పూజలు

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండలం, జీళ్ళచెరువు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను, సీసీ రోడ్లను ఎమ్మెల్యే వీధి వీధి తిరిగి పరిశీలించారు.జీళ్ళచెరువు బస్టాండ్ సెంటర్ నుంచి మందుల బజార్ వరకు నూతనంగా నిర్మాణం చేసిన సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జీళ్ళచెరువులోని పురాతన దేవాలయం శివాలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకుడు చిలకమర్రి స్వామినాథ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ శేఖర్, మండల పార్టీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, గ్రామ సర్పంచ్ కొండ సత్యం, ఎంపిటిసి అంబాల ఉమా శ్రీను, ఉపసర్పంచ్ గోపి హరినాథ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేశం, గ్రామ నాయకులు రమేష్, బొడ్డు నరేందర్, గ్రామ పెద్దలు, ఇతర నాయకులు పాల్గొన్నారు..

ఇదికూడా చదవండి: “కందాళ”కు పరీక్షే నా..?