Telugu News

ఖమ్మం రూరల్ ఈద్గా లో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే కందాళ 

ముస్లిం సోదరులతో అలయ్ బలయ్

0

ఖమ్మం రూరల్ ఈద్గా లో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే కందాళ 

== ముస్లిం సోదరులతో అలయ్ బలయ్

(ఖమ్మం రూరల్ -విజయం న్యూస్)

రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం తేల్ధారుపల్లి గ్రామ పరిధి లోని ఈద్ గా లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా అక్కడికి వెళ్ళిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో అలయ్ బలయ్ చేస్తూ  రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు సుఖసంతోషాలతో జీవించే విధంగా ఆ అల్లా చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ వర ప్రసాద్, బెల్లం వేణు తదితరులు హాజరయ్యారు.