Telugu News

‘పాలేరు’ లో ఘనంగా ఎమ్మెల్యే కందాళ జన్మదిన వేడుకలు

 కూసుమంచి క్యాంఫ్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు

0

పాలేరు’ లో ఘనంగా ఎమ్మెల్యే కందాళ జన్మదిన వేడుకలు
 కూసుమంచి క్యాంఫ్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు
 ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తాతామధు, స్వర్ణకుమారి
 భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు
 మెగా రక్తదానం సక్సెస్
(కూసుమంచి-విజయంన్యూస్);-
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున జరుపుకున్నారు. పాలేరు నియోజకవర్గవ్యప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పరస్పర శుభాకాంక్షులు తెలుపుకున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి శుభకాంక్షలు తెలిపారు. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుని అతికొద్ది రోజుల్లోనే మనందరి మధ్య తిరగాలని, ప్రజలకు సేవకార్యక్రమాలను అందించాలని కోరారు.
 ఎమ్మెల్యే క్యాంఫ్ లో

ALSO READ :-మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ లక్ష్యం : నామా
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్యాంఫ్ కార్యాలయంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తుల, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతామధు, టీఆర్ఎస్ జిల్లా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి హాజరై వేడుకలను నిర్వహించారు. కందాళ ఉపేందర్ రెడ్డికి కరోనా పాజిటీవ్ రావడంతో ఆయన హోమ్ హోసోలేషన్ లో చికిత్సపొందుతుండా ఉత్సవాలకు ఆయన కుమార్తెలు దీపిక-దీప్తి,అల్లుడు డాక్టర్ సురేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
 రక్తదాన శిబిరం సక్సెస్

ALSO READ:-★ పేదల బతుకులు ఛిద్రంచేస్తున్న బీజేపీ
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదానశిబిరాన్ని ఏర్పాటు చేయగా సక్సెస్ అయ్యింది. తలసేమియా వ్యాధి గ్రస్తుల కొరకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ తాతామధు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తాతమధు మాట్లాడుతూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రజా నాయకుడిగా, అందరివాడిగా పనిచేస్తున్నారని, అందుకే ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందడం పాటు ఆయన స్వంతంగా ఇచ్చే అర్థిక చేయూత కూడా పార్టీకి మంచిపేరు తీసుకోస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కుమార్తే దీప్తి మాట్లాడుతూ మా నాన్నపై ఇంతప్రేమను చూపిస్తున్న పార్టీ నాయకులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు.