Telugu News

రోడ్డుపై బెటాయించిన ఎమ్మెల్యే కందాళ.

**రైతు వ్యతిరేక విధానాల పై నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే కందాళ.

0

రోడ్డుపై బెటాయించిన ఎమ్మెల్యే కందాళ
**రైతు వ్యతిరేక విధానాల పై నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే కందాళ.

(కూసుమంచి-విజయం ప్రతినిధి)

కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కూసుమంచి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూసుమంచి మండల కేంద్రంలో ఖమ్మం-సూర్యపేట రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున రోడ్డు పై బెటాయించారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల కోసం ఏ పోరాటానికైనా సిద్దమేనని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేలేదని, రైతుల పక్షాన నిలిచే ఏకైక పార్టీ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు శ్రీనివాస్, జడ్పీటీసీ ఇంటూరి బేబి, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య తదితరులు హాజరైయ్యారు..

also read :-ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ.