Telugu News

ఏన్కూరు లో రామాలయంలో ఎమ్మెల్యే పూజలు

స్వాగతం పలికిన అర్చకులు, నాయకులు 

0

ఏన్కూరు లో రామాలయంలో ఎమ్మెల్యే పూజలు

== స్వాగతం పలికిన అర్చకులు, నాయకులు 

ఏన్కూరు మే 30(విజయం న్యూస్):

(రిపోర్టర్ -చారి)
ఏన్కూరు దాసరి కాలనీలోని రామాలయంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. ఏన్కూరు కు చెందిన దాసులు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవాలని,గెలిస్తే ఎమ్మెల్యే ద్వారా కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటామని మొక్కుకున్నారు.దీనిలో భాగంగా గురువారం ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాసుల అభివృద్ధికి,వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్,నాయకులు మేడ ధర్మారావు, చందమామ నరసింహారావు,భూదూరి శేషయ్య,పల్లం వెంకటేశ్వర్లు,ధర్మపురి రమేష్,మైసారావు,శోభన్ నాయక్,ఆది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.