కడియం శ్రీహరికే ఎమ్మెల్యే రాజయ్య మద్దతు
== ప్రకటించిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో చర్యలు సఫలం
(స్టేషన్ ఘనపూర్-విజయంన్యూస్)
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజయ్య నడుమ చర్చలు ఫలించాయి.. స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంతో అలకభూనిన ఎమ్మెల్యే రాజయ్యను మంత్రి కేటీఆర్ కాకాపట్టే ప్రయత్నం చేయగా సఫలమైయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. కాగా, వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన విషయం తెలిసిందే… అయితే రాజయ్య ప్రకటనతో ఆయన అనుచరులు ఒక్కసారిగా కలవరపడ్డారు.. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య టిక్కెట్ కోసం కొట్లాడే అవకాశం ఉందని తన అనుచరులు భావించగా, మంత్రి కేటీఆర్ తో చర్చల నేపథ్యంలో వారు అవాక్కైయ్యారు. కొంత మంది వ్యతిరేకించిన ఎక్కువ శాతం మంది రాజయ్యతో నడిచే అవకాశం ఉంది.
allso read- పాలేరులో బీఆర్ఎస్ కు బిగ్ షాక్