మంత్రి పువ్వాడ పై ఎమ్మెల్యే రాములు ఫైర్
== నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటి
== విధేయతకు దక్కే గౌరవం ఇదేనా?
== రాజ్యాంగ పరమైన హక్కులను కూడా కాలా రాస్తారా?
== రాజ్యాంగం తనకు కల్పించిన హక్కుల్లో జోక్యం చేసుకోవడం సరికాదు
== తప్పుడు రిపోర్టులతో టికెట్ రాకుండా చేసింది మీరు కాదా
== నన్ను తొక్కలని చూస్తే తగిన గుణపాఠం తప్పదన్న రాములు నాయక్
(వైరా-విజయంన్యూస్)
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఓ రెంజ్ లో ఫైర్ అయ్యారు.. రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ జలక్ ఇచ్చారు.. ఆయన వ్యవహార శైలి ని తప్పు పడుతు ద్వజమెత్తారు. నా నియోజకవర్గంలో నీ పెత్తనమేంటీ..? అంటూ ప్రశ్నించారు.. రాజ్యంగ హక్కులను కాలరాస్తారా..? నాకు టిక్కెట్ రాకుండా చేసింది నువ్వు కాదా..? అంటూ ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైరా వ్యవసాయ మార్కెట్ నందు వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు ఎంపీపీలు, జడ్పిటిసిలు,సర్పంచులు, కౌన్సిలర్లు, సోసైటీ చైర్మన్లు,రైతు బంధు కన్వీనర్లు, టెంపుల్ చైర్మన్ లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,దిశ కమిటీ సభ్యులు, జడ్పి కోఆప్షన్ సభ్యులు,పార్టీ సీనియర్ నాయకులు హాజరైయ్యారు.
ఇది కూడా చదవండి: వేషగాళ్లు వస్తున్నారు..? జరజాగ్రత్త: మంత్రి
దీంతో వైరాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల ప్రజాప్రతినిధులు ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఏది ఆశించకుండా టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశానన్నారు. అయినా తాజాగా ప్రకటించిన జాబితాలో తనను అభ్యర్థిగా ప్రకటించకపోయినప్పటికీ పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న తనను ఇలా జిల్లా మంత్రి పువ్వాడ ఇబ్బంది పెట్టడం తగదన్నారు. ఎమ్మెల్యేగా నాకున్న రాజ్యాంగ హక్కులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలగజేసుకొని తన విధులకు ఆటంకం కల్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడది ఖమ్మం నియోజవర్గమా..? లేకుంటే వైరా నియోజవర్గమా..? అని సూటిగా ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యే, గిరిజన అభ్యర్థి మధ్య చిచ్చు పెడుతూ, తన రాజకీయ దురాహంకారాన్ని గిరిజనులపై రుద్దడం సరికాదన్నారు. నాకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మదన్లాల్ పెట్టిన దళిత బంధు లిస్ట్ ను మంత్రి పువ్వాడ ఆమోదించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రిగా మీ బాధ్యతలు నిర్వహించడం మర్చిపోయి వైరా నియోజవర్గంలో జోక్యం చేసుకోవడం తగదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: మంత్రి ‘అజయ్’ డే.. వెరీవెరీ స్పెషల్ డే..
ఉమ్మడి జిల్లాలో ఇలా పార్టీ నాయకులు, అభ్యర్థుల మధ్య చిచ్చు పెడుతూ అందరినీ ఓడగొట్టి తన ఒక్కడినే గెలిచానని అధిష్టానం దగ్గర చెప్పి మంత్రి పదవి పొందడం కోసం ఇలాంటి చర్యలు చేయడం తగదన్నారు. మంత్రి పువ్వాడ తన విధులకు ఆటంకం కలిగిస్తే తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరించారు.
== డౌన్ డౌన్ మినిస్టర్
ఎమ్మెల్యే మాట్లాడుతున్న క్రమంలో కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా సీట్లలో నుంచి లేచి ఎమ్మెల్యే రాములు నాయక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా మంత్రి పువ్వాడ ఖబర్ధార్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ని అవిమానిస్తే మమల్ని కూడా అవమానించినట్లేనని, రాష్ర్టంలో సీఎం కేసీఆర్ మాటే శిరోధార్యం అని వైరా నియోజక వర్గంలో లో ఎమ్మెల్యే మాటే వేదం అని వారి అడుగు జాడల్లో ముందుకు వెళ్తామని అన్నారు. గులాబీ జెండా సైనికులుగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని జై కేసిఆర్,జై రాములు నాయక్ అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వివిధ హోదాలో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
== సంచలనంగా మారిన వైరా ఎమ్మెల్యే ఆగ్రహం
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఉన్నఫలంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఒక రేంజ్ లో ప్రశ్నల వర్షం కురిపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక వైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటే, మరో వైపు ఈ రోజున ఎమ్మెల్యే రాములు నాయక్ మంత్రిపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తడం పట్ల సంచలనంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్, అధికార పార్టీ మంత్రిపై దుషణలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.