Telugu News

ఎమ్మెల్యే బాలకిషన్ కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి

 పరుగెత్తుకుంటూ కారుపై పిడిగుద్దులు గుద్దిన యువకులు

0
ఎమ్మెల్యే బాలకిషన్ కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి
==  పరుగెత్తుకుంటూ కారుపై పిడిగుద్దులు గుద్దిన యువకులు
== పలువురు అరెస్టు.. ఉత్కంఠ గా మారిన మానకొండూరు కేంద్రం
(మానుకొండూరు-విజయంన్యూస్)
మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలక్రిష్ణ పై యువకులు దాడి చేశారు.. గుండ్లపల్లి-గన్నేరువరం వరకు రోడ్డునునిర్మించాలని యువజన సంఘాల ఆద్వర్యంలో ధర్నా చేస్తుండగా, అటువైపుగా వస్తున్న రసమయి బాలక్రిష్ణ కాన్వాయ్ పై యువకులు దాడి చేశారు. కారుపై పిడిగుద్దులు గుద్దుతూ  పెద్దగా అరుస్తూ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ పరుగులు తీశారు. కారు వెంటపడి మరి చుట్టుముట్టి పిడిగుద్దులు గుద్దారు. దీంతో అక్కడ ఉద్రక్తత వాతావరణం నేలకొంది.. పోలీసులు లాఠీచార్జీ చేసి కొంద మందియువజన నాయకులను అరెస్టు చేశారు.  ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా, యువజన సంఘాల నాయకులుపెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలిరావడం టెన్షన్ వాతావరణం నేలకొంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలో యువజన సంఘాల ఆద్వర్యంలో గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు వెళ్లే రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఆ రోడ్డును నిర్మాణం చేయాలని ధర్నా చేస్తున్నారు. దర్నా ఉద్రక్తంగా జరుగుతోంది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆ ధర్నా గురించి పట్టించుకోకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కొంత మంది యువకులు అడ్డం తిరిగారు. కారులో ఉన్న రసమయి వారి సమస్యను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో యువకులు రెచ్చిపోవడంతో రసమయి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా యువకులు ఆగ్రహించారు. చెప్పులతో దాడిచేసే ప్రయత్నం చేయగా ఆయన గ్లాసులు వేసుకున్నారు. కాగా కారుపై చెప్పులతో పిడిగుద్దులు గుద్దారు.. కారు వెళ్తుంటే వెంటబడ్డారు.. పోలీసుల అపుతున్న వారిని నియంత్రించుకుని వెంటబడి మీర కారుపై దాడి చేశారు. పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో కొంత సందుదొరికగా అక్కడ నుంచి రసమయి వెళ్లిపోయారు. అనంతరం మానుకొండూరులో యువకులపై, యువజన నాయకులపై కేసు పెట్టారు.

allso read- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం