బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా
ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించిన మెచ్చా. నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటున్న ఎమ్మెల్యే
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా
ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించిన మెచ్చా.
నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటున్న ఎమ్మెల్యే
(దమ్మపేట – విజయం న్యూస్):-
దమ్మపేట(మండలం), మందలపల్లి గ్రామంలోనీ సయ్యద్ అజీమ్ గారు లివర్ మరియు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి స్థానిక నాయకులు తీసుకువెళ్లడంతో ఈరోజు వారి నివాసానికి వెళ్లి అజీమ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు గారు.
ఈ సందర్భంగా వారి 10,000/- రూ ఆర్థిక సహాయం చేసి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చి మెరుగైన వైద్యం కోసం వైద్యులతో మాట్లాడుతానని తెలిపారు MLA గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పత్రిక సోదరులతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భగవంతుని దీవెనల వల్లే నేను ఈరోజు నలుగురికి సహాయం చేసే స్థానం లో ఉన్నానని.
నాకు ఓపిక ఉన్నంతకాలం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని.కష్టం వచ్చినా ప్రతి గడపకి అండగా ఉంటానని అన్నారు.
ALSO READ :-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి ముస్లింలు క్షీరాభిషేకం
ALSO READ :-కరెంట్ బిల్లుల పెంపు పై ఇల్లందులో ధర్నా
ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు , అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు , గ్రామ అధ్యక్షులు ఆకుల కృష్ణ రావు , బుడే , మందలపల్లి సర్పంచ్ దుర్గ, కోయ్యల అచ్యుత్ రావు , దమ్మపేట వైస్ ప్రెసిడెంట్ ధార యుగంధర్ ,అబ్దుల్ జిన్నా , తదితరులు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.