ఎమ్మెల్యే సండ్ర ఇళ్లు పాయే
== సీఎం ప్రేమతో ఇచ్చిన ఇళ్లు, స్థలాన్ని పాయే
== పార్టీ మారినందుకు గిప్ట్ ఇచ్చిన సీఎం కేసీఆర్..?
== మూడేళ్లలో నోటిసులీచ్చిన ఎన్ఎస్పీ అధికారులు
== ఖాళీ చేయించేందుకు విశ్వప్రయత్నాలు
== మండిపడుతున్న ఎమ్మెల్యే..?
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఏమి చేతుర లింగా..? ఏమి చేతు..? అనుకున్నది ఒక్కటాయే..అయ్యిందేమో మరోక్కటాయే..? పార్టీ మారితేనేమో..మంచి గిప్ట్ ఇచ్చిండాయే..? అగ్గువకే వచ్చిందని సంబురం పడినాయే..? అంతలోనే ఏమైందో..? తెలియదు కానీ.. అధికారులు దాడులాయే..? ఇంకేముంది.. పాయే..? అంతా అయిపాయే..? ఇది ఓ సినికవి రాసిన కవిత్వమే అయినా..? అక్షరాల సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తగిలినట్లే కనిపిస్తుంది.. పార్టీ మారినందుకు ప్రేమతో సీఎం కేసీఆర్ ఇచ్చిన గిప్ట్ ను ఎన్ఎస్పీ అధికారులు ఎగరేసుకపోయేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి ప్రేమతో అగ్గువ ధరకే అప్పనంగా ఇచ్చిందని తెలిసినప్పటికి అధికారులు అంతబలవంతంగా నోటీసులు ఇచ్చుడేంటో..? ఎవలికి బోద పడటం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. వారికే అంతుచిక్కని ప్రశ్నగా మారింది..? అగ్గువకే ఇచ్చినట్లు పత్రం కూడా సర్కార్ ఇచ్చింది.. జీవో విడుదల చేసింది.. అయినప్పటికి ఎందుకు నోటీసులిచ్చిందో..? ఎవలికి బుర్రకెక్కడం లేదంటా..? అయితే మస్తు కుట్ర దాగున్నదని, తెర వెనక ఉన్నదేవరు..? నడిపించేనాథుడేవ్వరూ..? మాకుతెలుసున్నట్లుగా సండ్ర వర్గీయులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది..ప్రదాత,విదాతలే ఇదంతా చేయిస్తున్నారా..? అన్నట్లుగా సండ్ర వర్గీయులు అనుమానిస్తున్నారు.. సర్కార్ అగ్గువ ధరకు జీవో తో సహా మార్చేసి ప్రకటించిన భూమిని ఎన్ఎస్ పీ అధికారులు నోటీసులేందుకు ఇచ్చిండ్రో మరికొంత విశ్లేషణగా చూడాల్సిందే..?
ఇది కూడా చదవండి: కమ్యూనిస్టుల జోలికి వస్తే తాట తీస్తాం: కూనంనేని
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఎదురుదెబ్బ తగలింది.. పార్టీ మారడంతోనే మొదటి గిప్ట్ గా ఆయన నివాసం ఉంటున్న ఎన్ఎస్పీ క్యాంఫ్ కార్యాలయంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇంటిని సీఎం కేసీఆర్ చాలా అంటే చాలా తక్కువ ధరకు సండ్రకు రాసిచ్చేశారు. అంతేకాకుండా జీవో విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చూశారు..? అయ్యిందో..?కాలేదో..? తెలియదు కానీ.. సీఎం కేసీఆర్ మొదటిగా ఇచ్చిన అపూర్వ గిప్ట్ ఇది. ఏం జరిగిందో ఏమో కానీ ఎన్ఎస్పీ అధికారులు సండ్ర వెంకటవీరయ్యకు షాక్ నిచ్చారు. క్వార్టర్స్ ను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.. దీంతో ఎమ్మెల్యేకు చిర్రేత్తింది.. నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు ఇవ్వడంతో సండ్ర వెంకటవీరయ్య తన ప్రస్తుత రాజకీయ గురువైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.. అయినప్పటికి ఫలితం లేదంటా..? ఎన్ఎస్పీ అధికారులు నోటీసులు ఇవ్వడం, ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడం, చేసేది లేక ఖాళీ చేయాల్సిన అవస్యకత ఏర్పడిందని తెలుస్తోంది.
== ఆభూమి ఎలా వచ్చిందంటే..?
సండ్ర వెంకటవీరయ్య పాలేరు నియోజకవర్గం నుంచి 1994లో సీపీఎం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సండ్ర ఓడిపోగా, ఆ తరువాత ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాయంలో టీడీపీ పార్టీలో చేరి 1999లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.అయితే అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ఎస్ఫీ క్వార్టర్స్ లో సీ/2 క్వార్టర్స్ ను కేటాయించగా, ఆ ఇంటిని పూర్తి స్థాయిలో సండ్రకు అవకాశం కల్పించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో సండ్ర ఓటమి చెందారు. అనంతరం 2009లో పునర్వీభజనలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం వెళ్లి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వరసగా మూడు సార్లు టీడీపీ పార్టీ నుంచి విజయం సాధించారు. రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి సండ్ర వెంకటవీరయ్య టీడీపీ పార్టీలోనే ఉండిపోయారు.
ఇది కూడ చదవండి: కన్నీటి పర్వంతమైన సీఎల్పీనేత
అప్పటి నుంచి ఆ క్వార్టర్స్ లోనే నివాసం ఉంటున్న సండ్ర మూడవ సారి గెలిచిన అనంతరం ఆయన 2020లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో సండ్రకు మంత్రి పదవి ఆపర్ వచ్చిందని, కోట్లాది రూపాయలను గిప్ట్ గా ఇచ్చారని పుకార్లు షికార్లే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతలోనే ఖమ్మంలో తను 20ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎన్ఎస్పీ క్వార్టర్స్ లోని ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయంను, కొంత పక్క ఖాళీల స్థలంను రెగ్యూలరైజ్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న సండ్రకు సీఎం కేసీఆర్ గిప్ట్ గా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో నేరుగా ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది.. ఆ సమయంలో విమర్శలు కూడా వచ్చాయి.. సండ్ర దానికి బదులు ఇవ్వలేకపోయారు కూడా..ఇంతలో..?
== ఇంటిని ఖాళీ చేయాలని సండ్రకు నోటీసులు ఇచ్చిన ఎన్ఎస్పీ అధికారులు
ఖమ్మం ఎన్ ఎస్ పీ లో గత రెండు దశాబ్దలకు పైగా సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయమని ఎన్ఎస్పీ అధికారుల ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఆయన నివాసాన్ని వేరే వాళ్లకు కేటాయించారని అందువల్ల ఖాళీచేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యేకు ఎన్ఎస్పీ అధికారులు చెప్పకోచ్చారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన లేఖను, జీవో కాఫీని సండ్ర చూపించినప్పటికి ఫలితం లేకపోయింది.. చివరికి రాష్ట్ర ప్రముఖులకు చెప్పుకున్న ఫలితం లేకపోయింది. మొత్తానికి రెండు రోజుల్లో క్వార్టర్స్ ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సండ్ర వెంకటవీరయ్య మీడియాకు తెలిపారు. ఎవరు ఇలా చేశారో..? నాకు తెలుసుని చెప్పకనే చెబుతున్నట్లు తెలుస్తోంది.. ప్రధాత, విధాతలే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు చేసినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య
అనేక మందికి వందల ఎకరాల భూములు ఉన్నా, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా వారి జోలికి వేళ్ళని అధికారులు తాను ఖమ్మం లో ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలనీ అనడం ,చాల దారుణమని , దుర్మార్గమని అంటున్నారు ఎమ్మెల్యే సండ్ర. తాను టీఆర్ యస్ లో చేరినప్పుడు కేసీఆర్ తనకు ఖమ్మంలో ఉంటున్న నివాసాన్ని రెగ్యూలరైజ్ చేశారని ప్రచారం జరిగిందని, ఇప్పటికైనా ఇది వాస్తవం కాదనే విషయాన్నీ ప్రజలు గ్రహించాలని అన్నారు .తాను పార్టీ మారింది నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల బాగుకోసం, చేరనే తప్ప దేన్నీ ఆశించలేదన్నారు. అప్పుడు కూడా కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేశారని వాపోయారు. ఇప్పటికి సత్తుపల్లిలో మూడు సార్లు గెలిచినా తాను అక్కడ ప్రజల అభిమానంతో వారి అండదండలు, ఆదరణతోనేనని అన్నారు . అందుకే వాళ్ళకోసం కష్టపడటం, వారికీ ఏదైనా చేయాలనే తలంపుతోనే ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గ అభివృధ్ధికోసం సహకరిస్తున్నారని అందుకే కొన్ని పనులు చేయగలిగామని ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని అన్నారు. సీఎం ను కలిసి అనేక మార్లు నియోజకవర్గ అభివృధ్ధికోసం నిధులు అడిగానని సానుకూలంగా స్పందించారని సత్తుపల్లి ప్రజల అండ ,కేసీఆర్ దీవెనలు ఉన్నంతకాలం వారికీ సేవచేస్తానని ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు.
అయితే ఈ విషయంపై సండ్ర వర్గీయులు, సత్తుపల్లి పార్టీ నాయకులు ఇంటి స్వాధీనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20ఏళ్లుగా నివాసం ఉంటున్న సండ్ర వెంకటవీరయ్య ఇంటిని ఖాళీ చేయించడమేంటని..? కావాలనే కుట్రలు పన్నుతున్నారని సండ్ర అనుచరులు ఆరోపిస్తున్నారు. దీని ప్రతిఫలాన్ని అనుభవిస్తారని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
(అసలు జరిగిందేంటి..? రేపటి సంచికలో..?)