Telugu News

ఈద్గాలో ప్రార్థనల్లో ఎమ్మెల్యే సండ్ర.

"ఈద్ ముబారక్" తెలిపిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య 

0

*ఈద్గాలో ప్రార్థనల్లో ఎమ్మెల్యే సండ్ర.

== “ఈద్ ముబారక్” తెలిపిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య

(సత్తుపల్లి -విజయం న్యూస్)

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని “ఈద్గా” వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు “ఈద్ ముబారక్” తెలిపారు. ముస్లిం సోదరులందరు రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించిందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2 కోట్ల రూపాయలు, వేంసూరు మండల కేంద్రంలో 75 లక్షల రూపాయలు, కల్లూరు మండల కేంద్రంలో 75 లక్షల రూపాయలతో షాదీ ఖానా లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పవిత్రమైన పర్వదినాన ఆ ‘అల్లా’ దేవుని దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో, సుఖ-సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాని ఎమ్మెల్యే సండ్ర చెప్పారు.