ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే సండ్ర
ఘన స్వాగతం పలికిన కల్లూరు అంబేద్కర్ నగర్ వాసులు
ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే సండ్ర
== ఘన స్వాగతం పలికిన కల్లూరు అంబేద్కర్ నగర్ వాసులు
(కల్లూరు/సత్తుపల్లి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్లూరు చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి కల్లూరు అంబేద్కర్ నగర్ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని, ప్రతి పేదవాడు పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్ని మతాలను గౌరవిస్తూ క్రిస్మస్ పండగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ కానుకలను అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు ఆత్మ చైర్మన్ వనమా వాసు, ఎంపీపీ రఘు, జెడ్పిటిసి అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి సభ్యులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, సంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం వెంకటేశ్వరరావు , ఉబ్బన వెంకటరత్నం, షేక్ ఇమామ్, సొసైటీ చైర్మన్ బోబోలు లక్ష్మణరావు, మేకల కృష్ణ , మండల యువజన విభాగం అధ్యక్షులు పెడకండి రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె ఇస్మాయిల్, కొరకొప్పు ప్రసాద్, కమ్లి, భాస్కరరావు, తడితరులున్నారు.
allso read- ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి