Telugu News

కూసుమంచి హైస్కూల్ కు వరాలు కురిపించిన ఎమ్మెల్యే

కూసుమంచి ఉన్నత పాఠశాలో ఘనంగా స్పోర్ట్స్  డే...

0

విద్యతోనే సమాజంలో మార్పు: కందాళ
= ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
= కూసుమంచి ఉన్నత పాఠశాలో ఘనంగా స్పోర్ట్స్  డే…
= ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు  
= కూసుమంచి విద్యార్థులపై వరాల జల్లు
(కూసుమంచి-విజయంన్యూస్)
విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని.. విద్యార్థులు కష్టపడి చదవాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం కూసుమంచి ఉన్నత పాఠశాలలో జరిగిన స్పోర్స్ట్ డేలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేను కోలాట బృందం   స్వాగతం పలికారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేల విక్రమ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల  మాట్లాడుతూ..  ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్నారు. విద్యార్థులకు చదువు అందిస్తే చాలు వారంతట వారే వృద్ధిలోకి వస్తరన్నారు.  ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు, ఆటపాటలతో పాటు సమాజంలో చిన్నప్పటి నుంచే మానవ సంబంధాల గురించి వివరించాలన్నారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ రేసులో  ‘ఆ ఇద్దరు’

ఏది మంచి ఏది చేడు అనేది చెప్పాలని కోరారు.  సమాజంలో జరిగే మార్పులపై అవగాహన కల్పించాలన్నారు. తన ఆశయం, అభిమతం అట్టడుగు వర్గాల పిల్లల, పేద పిల్లలకు  చదువుకు ఎల్లప్పుడు తన చేతనైన సాయం చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఉన్నతి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సాయంత్రం పూటా అల్పాహారం కోసం సొంతంగా నగదు అందజేస్తానన్నారు.రేపటి నుంచే ప్రారంభించాలన్నారు.  కూసుమంచి ఉన్నత పాఠశాలకు ఐదు లక్షల విలువైన ఇంట్రాక్టివ్ డిజిటల్  బోర్టు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. విద్య పరంగా ప్రభుత్వం నుంచే కాకుండా సొంతనిధులు ద్వారా కూడా సహాయం అందిస్తానన్నారు. క్రీడ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నారు.ఆకట్టుకున్న నృత్యాలు చూసి వెంటనే విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించారు.

ఇది కూడ చదవండి: పాలేరులో కందాళ గెలుపు ఆపగలరా..?: మంత్రి వేముల

పాఠశాలకు సహకరించిన దాతలు రేపాల శ్యాంసుందర్ , ఇంటూరి నారాయణరావు,  పిట్టల కన్నయ్య ,బోనగిరి సాయి రాజేష్, చౌడవరపు కృష్ణారావు హలవత్ రెడ్యా నాయక్, ,గంగాధర్, ఆలగడప వెంకటేశ్వర్లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటురి శేఖర్,రూరల్ జెడ్పీటీసీ వరప్రసాద్, సర్పంచ్ చెన్నా మోహన్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్ ఎస్కే మైమునా, మోతీలాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు