Telugu News

పాలేరు ప్రజల ఓట్లను అమ్మేసిన ఎమ్మెల్యే: భట్టి

దమ్ము, ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పాలకులు రావాలని భట్టి సవాల్*

0
పాలేరు ప్రజల ఓట్లను అమ్మేసిన ఎమ్మెల్యే: భట్టి
== రాజీనామా చేసి వెళ్తే మొగోడు అయ్యేవాడు
== ఏసీపీ అస్తులేంటో..? ఇక్కడికి ఎట్లోచ్చిండో తెలుసు
== పద్దతి మార్చుకోకపోతే మేము పద్దతి తప్పాల్సి వస్తుంది
== పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు నేను రెడీ*
== దమ్ము, ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పాలకులు రావాలని భట్టి సవాల్*
== జూలై2న ఖమ్మం బహిరంగ సభకు భారీగా తరలిరండి
(కూసుమంచి-విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గ ప్రజల ఓట్లను కాంట్రాక్టుల కోసం కేసీఆర్ వద్ద ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అమ్మేశాడని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విలువలను తాకట్టు పెట్టాడని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిర, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయితే 10 సంవత్సరాలు కావస్తున్న మిగతా 20% పనులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు

పూర్తయి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో రూ.25 వేల కోట్ల రూపాయలకు పెంచి పది సంవత్సరాలు కావస్తున్న ఒక్క ఎకరానికి కూడా చుక్క నీరు ఇవ్వని బిఆర్ఎస్ వైఫల్యంపై చర్చకు నేను సిద్ధం. ఈ అంశంపై మాట్లాడడానికి దమ్ము, ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పాలకులు చర్చకు రావాలని  సవాల్ చేశారు.

ఖమ్మం జిల్లాలో ఉన్న  ఇందిర, రాజీవ్ సాగర్ మాత్రమే కాదు ఆదిలాబాద్ లో ఉన్న కొమరం భీం, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేసిన 63 చెరువుల నుంచి పంట పొలాలకు సాగునీరు వెళ్లడానికి కాలువలు తవ్వకుండా దున్నపోతుల్లాగా చూస్తున్నారా? అని ప్రశ్నించారు.ప్రాణహితను చంపేసి కాలేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అని అడిగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి   జలయజ్ఞంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం వారిని అడవి నుంచి ఖాళీ చేయించే కుట్ర చేస్తుందని, సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టారని తెలిపారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చని బిఆర్ఎస్ ప్రభుత్వం, ఏం పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదన్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్ల మధ్యన డివైడర్లు కట్టి, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి, కలర్లు వేస్తే అభివృద్ధి అవుతుందా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి అంటే నాగార్జున్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టాలి స్పాంజ్ ఐరన్ కంపెనీలు తీసుకురావాలని,  సింగరేణి సంస్థ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించాలని,  కొత్త పవర్ ప్రాజెక్టు సంస్థలు తీసుకురావాలని,  ఇండ్లు లేనివారికి ఇండ్లు,  కొలువులు, విద్య, వైద్యం, ఉద్యోగాలు లేని యువతకు స్వయం ఉపాధి ద్వారా రుణాలు ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు బిఆర్ఎస్  చేసిన అభివృద్ధి ఏంటి?  10 ఏండ్ల పరిపాలనలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారా? కొత్త పరిశ్రమ తీసుకువచ్చారా? కొత్తగా కొలువులు ఇచ్చారా? బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదు గుండు సున్నా అని, పాలేరు నియోజకవర్గ ప్రజల ఓట్లను కాంట్రాక్టుల కోసం కేసీఆర్ వద్ద  ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అమ్మేశారని అన్నారు. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేసి వెళితే మొగోడిలాగా ఉండేదన్నారు. గతంలో పాలేరు నుంచి శాసనసభ్యులుగా గెలిచిన సంభాని చంద్రశేఖర్, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు ఏనాడు ప్రజల ఓట్లను కందల ఉపేందర్ రెడ్డి లాగా అమ్ముకోలేదని విమ్మర్శించారు. వారు పాలేరుకు నాగార్జునసాగర్ జలాలు తీసుకొచ్చేలా చేశారని,  ఇం

డ్లు లేని పేదలకు ఇల్లు ఇప్పించారని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని, పాలేరు ప్రజలు తలెత్తుకొనే విధంగా పనిచేశారని కొనియాడారు.  కానీ, కందాల ఉపేందర్ రెడ్డి కాంట్రాక్టుల కోసం కేసీఆర్ కాళ్ళ వద్ద మోకరిల్లిన ప్రజాస్వామ్య ద్రోహి  ఆయన అని ఆరోపించారు.
కందాల ఉపేందర్ రెడ్డి  పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టిస్తావా? నాలుగు నెలలు ఆగితే నిన్ను నీ పార్టీని పాలేరు ప్రజలు బంగాళా
ఖాతంలో పడేస్తారని పేర్కొన్నారు. ప్రజలతో రాళ్లు వేయించుకునే దుస్థితి తెచ్చుకున్నందుకు కందాల ఉపేందర్రెడ్డి సిగ్గుపడాల్సింది పోయి, అధికారం ఉందని పోలీసులతో కేసులు పెట్టిస్తావా?, కూసుమంచి పాదయాత్ర వేదిక నుంచి ఏసీపి ని హెచ్చరిస్తున్నా… ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం. పోలీస్ రాజ్యం కాదన్నారు. ఏసిపి  మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు.  మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసు, మీ ఆస్తులు తెలుసని, ప్రజలే మీ సంగతేమిటి చూస్తారని అన్నారు. మీరు పోలీస్ మాన్యువల్ ప్రకారంగా పనిచేయకుండా సంఘవిద్రోహ శక్తులను అరెస్టు చేసినట్లు అర్ధరాత్రి మండల కాంగ్రెస్ నాయకులు ఇంటికి ఎలా వెళ్తావని ప్రశ్నించారు. మీలాంటి పోలీసుల గురించి చిట్టా రాస్తున్నాం, కాంగ్రెస్లో అధికారంలోకి రాగానే చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అయితే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని, మీలాంటి పోలీసుల గురించి ఇటీవల సీఎం కేసీఆర్ కు లేఖ రాశానని గుర్తు చేశారు. అధికార మదం తలకెక్కితే ఆ మదాన్ని దించడానికి ఆదిలాబాద్ నుంచి కదం తొక్కుతూ ఖమ్మం వరకు వస్తున్నది పీపుల్స్ మార్చ్ అని సూచించారు.  పాలేరు ప్రజలకు  విజ్ఞప్తి…. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీ ఓటుకు విలువ ఇచ్చే వారిని ఎన్నుకోండి. మీ ఓటును మీ నమ్మకాన్ని అమ్ముకునే ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వొద్దని కోరారు.తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జూలై రెండున ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. ఇదే సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక ఉంటుంది. ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు కదలి రావాలని పిలుపునిచ్చారు.