ఎమ్మెల్యేలు, అధికారులు కుమ్మకైయ్యారు: బీజేపీ నేత శ్రీదర్ రెడ్డి
గోల్ తండా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ నేత కొండపల్లి శ్రీదర్ రెడ్డి
ఎమ్మెల్యేలు, అధికారులు కుమ్మకైయ్యారు: బీజేపీ నేత శ్రీదర్ రెడ్డి
== రైతులను బలి చేస్తున్నారు
== గోల్ తండా కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ నేత కొండపల్లి శ్రీదర్ రెడ్డి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
పౌరసరఫరాల శాఖ టిఆర్ఎస్ శాసనసభ్యుల కుట్రలకు రైతులు బలవుతున్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను అత్యంత ఆర్భాటంగా రిబ్బన్లు కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేసినటువంటి శాసనసభ్యులు మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా ముఖం చాటేస్తున్నారని శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బిజెపి సహచర నాయకులతో కలిసి తిరుమలాయపాలెం మండలం గోల్ తండా పిఎసిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన కేంద్రం ప్రారంభించి 20 రోజులు దాటుతున్న ఒక్క లారీ కూడా కాంటాలు పూర్తి చేసుకోకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షాలకు భయపడి క్వింటా వడ్లు కేవలం 1500 కే తెగ నమ్ముకుంటున్నామని శ్రీధర్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మధుసూదన్ కు శ్రీధర్ రెడ్డి ఫోన్ చేసి రైతుల ఆవేదనను వివరించారు.
ఇది కూడా చదవిండి: ఇసుక మాఫియాకు లీడర్ మంత్రి పువ్వాడ : బీజేపీ
స్పందించిన జాయింట్ కలెక్టర్ వెంటనే కొనుగోలు కేంద్రానికి లారీలు పంపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు జరగక రైతులు మండుటెండలో అలమటిస్తా ఉంటే శాసనసభ్యులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యులు మిల్లర్లతోని రహస్య ఒప్పందం కుదుర్చుకొని రైతులను బలి చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కాంటా పూర్తయిన వడ్లకు ఇచ్చిన రసీదుకు విలువ లేకుండా మిల్లర్లు క్వింటాలకు 15 కేజీల కోత విధించడం పౌరసరఫరాల శాఖ శాసనసభ్యులకు మిల్లర్లతో ఉన్న చీకటి ఒప్పందానికి నిదర్శనం అన్నారు. వెంటనే పరిస్థితిని చక్కదిద్ది కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 2060 రైతులకు అందేలా చూడాలని లేనిపక్షంలో రైతులు పండించిన వడ్లను శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో పోస్తామని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కెళ్ళపల్లి నరేంద్ర రావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్ ,బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నూకల రామ్మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి ప్రసాద్, బిజెపి మండల నాయకులు గుండా గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు
ఇది కూడా చదవండి: పేపర్ లీకేజ్ కి మంత్రి కేటీఆర్ బాధ్యుడు: బీజేపీ