Telugu News

ఫిరాయించి ఎమ్మెల్యేలను వదిలేదే లేదు: భట్టి విక్రమార్క

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

0

ఫిరాయించి ఎమ్మెల్యేలను వదిలేదే లేదు: భట్టి విక్రమార్క

==ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి

== స్పీకర్ కు వినతి చేసిన పట్టించుకోలేదు

== ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

== సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయన్యూస్)

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను వదిలేదని లేదని, కచ్చితంగా చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని సీఎల్పీ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ అధికార ఆర్థిక ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపు చేసిన 12 మంది ఎమ్మెల్యేలపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?

ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేసిన సమయంలో స్పీకర్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని, సీఎల్పీ నేతగా నేను, ఆనాడు శాసనమండలి నేతగా ఉన్న షబ్బీర్ అలీ ఇద్దరం కలిసి స్పీకర్ ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశామని అన్నారు. పార్టీ ఫిరాయింపుల  చట్టం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కోరడం జరిగిందని పేర్కొన్నారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా మేము ఇచ్చిన ఫిర్యాదుపై నిర్లక్ష్యం చేశారని, పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వ పార్టీకి వంతపాడారని ఆరోపించారు.  టిఆర్ఎస్ లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కట్టకట్టుకొని ఒకసారి చేరలేదు విడతల వారీగా చేరారని, విడుతల వారీగా వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం ఫిరాయింపుల చట్టం ఉల్లంగనేనని, రాజకీయ కక్ష సాధింపుల్లో బాగంగా టిఆర్ఎస్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఫిరాయింపుల చట్టాన్ని నవ్వుల పాలు చేసిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై సమగ్రమైన విచారణ జరిగపి చర్యలు తీసుకునేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని, వాళ్లను వదిలేదే లేదన్నారు.

ఇది కూడా చదవండి: ‘పేట కాంగ్రెస్’ లో అధిపత్య పోరు