Telugu News

రేపు జిల్లాకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పర్యటన

జయప్రదం చేయాలని కోరిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యడవల్లి సంతోష్

0

రేపు జిల్లాకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పర్యటన

== జయప్రదం చేయాలని కోరిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యడవల్లి సంతోష్

(ఖమ్మం-విజయం న్యూస్)

*తెలంగాణ రాష్ట్ర NSUI అద్యక్షులు డాక్టర్ వెంకట్ బల్ముర్ MLC  పర్యటన విజయవంతం చేద్దాం రండి కదలి రండి అంటూ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ పిలుపునిచ్చారు. రేపు అనగా 29 తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం విచ్చేయుచున్న వెంకట్ బల్ముర్  ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రాము సహాయం రఘురాం రెడ్డి  విజయాన్నికాక్షిస్తూ ఖమ్మం కాల్వ ఒడ్డు నుంచి పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, మీదుగా ఎస్ఆర్ కన్వెన్షన్ కు చేరుకుంటారు.అక్కడ ఖమ్మం పార్లమెంట్ NSUI శ్రేణులను దిశా నిర్దేశం చేస్తారు.

ఇది కూడా చదవండి:- బరువు మోస్తా.. మీ బాధ్యతలు చూస్తా: రఘురాం రెడ్డి 

ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మరియు  మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి MLA లు పాల్గొంటారు అని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ విద్యార్థిని విద్యార్థులు, NSUI కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.