Telugu News

రూ.4లక్షల విలువ చేసే అంబర్ ప్యాకెట్ల స్వాధినం

పట్టుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు

0

నిషేధిత అంబర్ ప్యాకెట్లు పట్టుకున్న టాస్క్ఫోర్స్, ఖమ్మం రూరల్ పోలీసులు

(ఖమ్మం రూరల్ -విజయం న్యూస్)

టాస్క్ ఫోర్స్ బృందానికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ తో కలసి ఖమ్మం రూరల్ పోలీసులు సంయుక్తంగా ఖమ్మం రూరల్ మండలంలోని MV పాలెం గ్రామం వద్ద వాహన తనిఖీలు నిర్వహించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన TS03EC4698 నంబర్ కలిగిన ఒక టాటా ఇండికా కారును పట్టుకున్నారు. కారులో నాలుగు లక్షల విలువ చేసే 8 బస్తాల నిషేధిత అంబార్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

also read : 14 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుబాటు

నిందుతులు కురవి మండలంలోని అప్పర్‌గూడెం గ్రామానికి చెందిన తల్లాడ ఉమేష్, గుంటి రమేష్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఉమేశ్ అనే నిందితుడు హైదరాబాదులోని ఎల్బీ నగర్ కు చెందిన సుజిత్ రెడ్డి అనే వ్యక్తి సహాయ సహకారాలతో బీదర్ నుండి అక్రమ రవాణా ద్వారా కురవి మండలానికి తరలించి సమీప గ్రామాల్లో అధిక ధరలకు అంబర్ ప్యాకెట్లు విక్రయిస్తునట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు రూరల్ ఏసీపీ తెలిపారు.

also read :మణుగూరులో రూ.2.90కోట్ల భారీ కుంబకోణం