Telugu News

మోడీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలి: తమ్మినేని 

ఎర్రజెండా అండగా మరిన్ని పోరాటాలు నిర్మిద్దాం:

0

మోడీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలి: తమ్మినేని 

== ఎర్రజెండా అండగా మరిన్ని పోరాటాలు నిర్మిద్దాం:
== వ్యవసాయ,కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న మోడీ ప్రభుత్వం..
== జీళ్ళచెరువులో జరిగిన మేడే వేడుకల్లో  మోడీపై మండిపడిన  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..

 (కూసుమంచి-విజయం న్యూస్)
కార్మికులకు అండగా ఎర్రజెండా ఉంటుందని, ఈ ఎర్రజెండా స్ఫూర్తితో రైతు,కార్మిక, శ్రమజీవుల కోసం మరెన్నో పోరాటాలను నిర్మిద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో మేడే వారోత్సవాల్లో భాగంగా ఆయన గ్రామం సెంటర్ లో ఎర్రజెండాను ఎగరవేశారు. అనంతరం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు గోపే జానికిరాములు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ బరిలో తమ్మినేని

ప్రపంచ కార్మికుల ఐక్యత చాటే మేడే రోజును జీళ్ళచెరువు గ్రామంలో అమరవీరులను స్మరించుకుంటూ వారి పోరాటాలను, త్యాగాలను మనం మునుముందు మరెన్నో కార్మికుల సర్కుల కోసం మరెన్నో పోరాటాలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వ్యవసా య కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతుందని ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే కార్మిక చట్టాలను రద్దు చేసే ప్రమాదం ఉందని, రానున్న రోజుల్లో ప్రజలు మరింత చైతన్యమై మోడీ ప్రభుత్వాన్ని గద్దించే విధంగా పోరాటాలు నిర్మించాలని, మోడీ ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలు ఆకాశం అంటుతున్నాయని, వంటనూనె, గ్యాస్, పెట్రోలు తదితర నిత్యవస ధరలు సామాన్యులకు అందుబాటులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు చైతన్యమై గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు చట్టసభల్లో ఉంటే కార్మికుల కోసం, రైతుల కోసం, ఎన్నో చట్టాలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేసిందని అందులో భాగంగానే యూపిఏ వన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 63 మంది పార్లమెంట్ సభ్యులు ఉండగా ప్రజలందరికీ రైతులకు, కార్మిక కర్షక, రైతులకు, ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టాన్ని ఎర్రజెండాల మద్దతుతో ఉన్న ఆ నాటి ప్రభుత్వం ఆ చట్టను తీసుకొచ్చిందని, కానీ బిజెపి ప్రభుత్వం మాత్రం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తుందని, ప్రస్తుతం బడ్జెట్లో గతం కంటే ఉపాధి హామీ పథకం నికి బడ్జెట్లో 33 శాతం నిధులు తగ్గించిదని, ఉపాధి హామీ పథకాన్ని రైతులకు, కార్మికులకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం: తమ్మినేని

మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగట్టాలని, రానున్న రోజుల్లో ప్రజల కోసం, కార్మికుల కోసం, పనిచేసే ఎర్రజెండా కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ కార్యదర్శి సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి జానకి రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్, జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, డాక్టర్ వెంకటేశ్వరరావు,, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, కొండపల్లి మండల కార్యదర్శి కె.వి.రెడ్డి ,సిపిఎం సీనియర్ నాయకులు శీలం గురుమూర్తి ,మల్లెల సన్మత రావు, తోటకూరి రాజు,గన్య నాయక్, వెంకటేశ్వరరావు, వార్డు సభ్యుడు మడిపల్లి ప్రసాద్, మండల కమిటీ సభ్యులు ,పలు గ్రామాల కార్యదర్శులు, పార్టీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు