Telugu News

మోడీ పంజాబ్ లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగ జార్చింది : భట్టి విక్రమార్క

పీఎం సభకు జనాలురాక పోవడంతో వెనుదిరిగి వెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రత ఇవ్వలేదని పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేయడాన్ని ఖండిస్తున్నాను

0

మోడీ పంజాబ్ లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగ జార్చింది : భట్టి విక్రమార్క
(హైదరాబాద్ –విజయంన్యూస్)
పీఎం సభకు జనాలురాక పోవడంతో వెనుదిరిగి వెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రత ఇవ్వలేదని పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేయడాన్ని ఖండిస్తున్నాను. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధింపు, దళిత సీఎం ఫెయిల్ అయినట్లు‌, పంజాబ్ దళిత సీఎంను నవ్వులపాలు చేయాలని, బిజెపి కుట్ర చేస్తున్నది.

గతంలో ఒరిస్సాలో జరిగిన బహిరంగ సభలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ మీద రాయితో దాడి చేసినప్పటికీ కాంగ్రెస్ ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వంపైన నిందలు వేయలేదు. బదనాం చేయలేదు. చాలా హుందాగా ప్రధాని ఇందిరాగాంధీ వ్యవహరించారు. పీఎంకి వత్తాసుగా పంజాబ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రం లో బండి సంజయ్, బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామాలు ఆపాలి.

ధాన్యం కొనుగోలు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాతో రైతులు నష్ట పోయారు. సీఎల్పీ బృందం మిర్చి రైతులను కలిసి భరోసా కల్పిస్తాం.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా మారింది.

పోలీసుల వద్ద రక్షణ లభించక ప్రజలు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారని అనడానికి రామకృష్ణ ఘటననే సాక్ష్యం.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.

ALSO READ :- తెలంగాణలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

దాని ఫలితంగానే న్యాయం జరగదని, రక్షణ కరువు అయినందున పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కు పాల్పడింది
టిఆర్ఎస్ నుంచి వనమా రాఘవను సస్పెండ్ చేస్తే సరిపోదు. రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావును కూడా టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా…
పోలీస్ లు ప్రొటెక్షన్ ఇవ్వక పోవడం వల్లనే మంథనిలో వామన రావు హత్య జరిగింది.
పోలీస్ లను టిఆర్ఎస్ తమ కేడర్ గా మార్చుకుంది. దాని వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
క్షీణిస్తున్న శాంతిభద్రతల సంరక్షణ కోసం గవర్నర్, డిజిపి లను CLp బృందం కలుస్తుంది.
యాసంగి ధాన్యాన్ని కూడా రాష్ట్రం కొనుగోలు చేయాల్సిందే..,
తామరపురుగుతో మిర్చి రైతులు నష్టపోయారు.
మిర్చి, పసుపు, పత్తి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి..
మిర్చి రైతులకు భరోసా కల్పించడానికి త్వరలోనే సీఎల్పీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి తోటలను పరిశీలిస్తుంది.
రైతులకు రుణమాఫీ చేయనందుకు, ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నందుకేనా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సంబరాలు నిర్వహిస్తున్నది?
రైతు బంధు సంబరాల పేరుతో రైతులను వంచిస్తున్నారు.
ప్రతిపక్షాలకు కోవిడ్ నిబంధనలు, మీరు మాత్రం సంబరాలు చేస్తారా?
విద్యుత్ చార్జీలు పెంచితే ఊరుకోము. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరణ చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రమే స్థానికత సమస్యతో ఏర్పడింది. జీవో 317తో ఉద్యోగుల్లో లో లో గందరగోళం ఏర్పడింది.

371డి ని ఈ జీవో చంపేసింది..
జిఓ 124 కేంద్రానికి వచ్చినప్పుడు బీజేపీ ఏం చేసింది.
317 జీవోను రద్దు చేయాల్సిందే ను
371D భిన్నంగా ఉన్నా జీవో 124, 317 లను రద్దు చేయాలని సీఎల్పీ బృందం కేంద్రహోం శాఖకు లేఖ రాస్తాం..

ALSO READ :-‘పాలేరు’ లో మరో రాఘవుడున్నాడా..?