Telugu News

దత్త పుత్రుల కోసమే మోడీ పాలన : నారాయణ 

బిజెపితో బిఆర్ఎస్ పొత్తు పరోక్షం కాదు ప్రత్యక్షమే : పొంగులేటి

0
దత్త పుత్రుల కోసమే మోడీ పాలన : నారాయణ 
==బిజెపి, బిఆర్ఎస్ను ఓడించండి
== ఎర్ర జెండా స్ఫూర్తితోనే అభివృద్ధి : తుమ్మల
== బిజెపితో బిఆర్ఎస్ పొత్తు పరోక్షం కాదు ప్రత్యక్షమే : పొంగులేటి
== ఉద్యమ ఖిల్లాలో కూటమికి ఎదురు లేదు: కూనంనేని
 == సిపిఐ సమావేశానికి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు* 
  (ఖమ్మం-విజయం న్యూస్): 
మోడీ దత్త పుత్రులైనా అంబానీ, అదానీలతో పాటు 29 మంది కార్పొరేట్ శక్తుల కోసమే పాలన సాగిస్తున్నారని రూ. 14 లక్షల కోట్ల ఎగవేసిన వీరిని మోడీ ప్రభుత్వం కాపాడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ప్రధాని మోడీ తనకు కుటుంబం లేదు, అవినీతి చేయను అంటున్నారని కానీ దత్తపుత్రులంతా అవినీతిపరులేనని ఇందులో ఆరుగురు మోడీ పేరుతోనే ఉండడం గమనార్హమన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థాయి సిపిఐ కార్యకర్తల సమావేశం గురువారం స్థానిక ఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ మోడీ మాటలు భవిష్యత్తు ప్రమాదానికి అద్దం పడుతున్నాయని మోడీ తీరును ప్రగతిశీల కాముకులు, మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తప్పుబడుతున్నారని మోడీ కోరుతున్న 400 సీట్లు ఇస్తే రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయని ఇక ప్రజాస్వామ్యం ఉండదని హిట్లర్ పాలన కొనసాగుతుందన్నారు. మోడీ దిగజారుడు వ్యాఖ్యలు ఆయన ఓటమి భయాన్ని తెలియజేస్తున్నాయని హిందువుల మంగళ సూత్రాలు ముస్లింలకు పంచుతారన్న వ్యాఖ్యలు ఆయన భయాన్ని తెలియజేస్తున్నాయని నారాయణ తెలిపారు. మంగళసూత్రాలపై నమ్మకం లేని వ్యక్తి మంగళసూత్రాల గొప్పతనాన్ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కుటుంబాన్ని మోసం చేసిన వాడు దేశాన్ని మోసం చేస్తారని ఆయన తెలిపారు. మోడీ కుటుంబాన్ని మోసం చేశారని ఇక దేశాన్ని మోసం చేసే కుట్రకు తెరలేపారన్నారు.
బిజెపి వ్యతిరేకులపై చట్టాన్ని ప్రయోగిస్తున్నారని ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉంటే మూడో ముఖ్యమంత్రికి నోటీసు ఇచ్చారని రేవంత్‌రెడ్డిని అరెస్టు చేస్తే బిజెపికి పుట్టగతులు ఉండవన్నారు. తమకు ఇష్టమైన వారు ఏ తప్పు చేసిన బిజెపి మాట్లాడదని జగన్ లక్షల కోట్లు దోచుకుని పదేళ్లుగా బెయిల్ పై ఉన్న బిజెపికి దత్త పుత్రుడు కాబట్టి పట్టించుకోవడం లేదన్నారు. నామ నాగేశ్వరరావు అమాయకుడని కేసిఆర్ మాయలో పడ్డారని నారాయణ తెలిపారు. కేసిఆర్ మాటలు ఇప్పుడు జనం నమ్మె పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్కు కాలం చెల్లిందని తెలిపిన నారాయణ ఉత్తరాదిన బిజెపికి సీట్లు తగ్గుతున్నాయని అధికారంలోకి రావడం కల్లేనన్నారు. యేటా రెండు కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిన బిజెపి ఆ పని చేయలేదని ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం 1.75 కోట్ల ఉద్యోగాలకు అవకాశం కల్పించారన్నారు.కానీ అందులో వాస్తవం లేదన్నారు. పబ్లిక్ సెక్టార్‌ను విక్రయిస్తూ కోట్లాది ఉద్యోగాలను ఊడగొడుతున్నారని నారాయణ తెలిపారు. 29 మంది రూ. 14 లక్షల కోట్లు ఎగవేస్తే అందులో 25 మంది గుజరాతీయులేనని ఆయన ఆరోపించారు. సామాన్యులు వినియోగించే చెప్పుల పైన పన్నును ఐదు నుంచి 18 శాతం పెంచిన బిజెపి కార్పొరేట్ పన్నును మాత్రం 33 నుంచి 27 శాతానికి తగ్గించిందన్నారు. లక్షల కోట్లు ఎగవేసిన 29 మందిలో ఒక్క ముస్లింమైన ఉన్నారా అని నారాయణ ప్రశ్నించారు. బిఆర్ఎస్ఈ ఊగిసలాటని బిజెపిది భయాందోళన అని ఒక్క ఓటుతో రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు.