Telugu News

మోదుగు ఆశీర్వాదంకి వైరా మార్కెట్ చైర్మన్ పదవిని కేటాయించాలి .

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు

0

***మోదుగు ఆశీర్వాదంకి వైరా మార్కెట్ చైర్మన్ పదవిని కేటాయించాలి .
***తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు
**(ఖమ్మం :విజయం న్యూస్):-

నగరంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం పునాది రాళ్ళు వేసినట్వంటీ తెలంగాణ ఉద్యమకారులను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం విస్మరిస్తూనే వస్తుందని , అన్ని అర్హతలు ఉన్నా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి తగు పదవులు ఇచ్చే గౌరవించవలసిన కనీస బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని , తెలంగాణ సమయంలో చాలా కీలకమైన ముఖ్యపాత్ర వహించిన సీనియర్ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడైన సత్తుపల్లి నియోజకవర్గం , తల్లాడ మండలానికి చెందిన మోదుగు ఆశీర్వాదంకి వైరా మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు .

also read :-రైతుబంధు సమితి క్యాలెండర్ ను అవిష్కరించిన ఎంపీపీ

ఉద్యమ సమయంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిని , జైలు జీవితాన్ని కూడా అనుభవించారని , వెనుదిరగకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదుగు ఆశీర్వాదం ముందు వరుసలో ఉన్నాడు అని హితవు పలికారు . ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారుడు గుంతేటి వీరభద్రం , డోకుపర్తి సుబ్బారావు , పగడాల నరేందర్ , తెలంగాణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .