Telugu News

కోతి మాతృ వేదన.

*చనిపోయిన పిల్లను మోస్తూ తిరుగుతున్న వానరం.

0

కోతి మాతృ వేదన.

*చనిపోయిన పిల్లను మోస్తూ తిరుగుతున్న వానరం.

తల్లి వేదన వర్ణనాతీతం.

(గార్ల – విజయం న్యూస్):- 

ఒక కోతి ప్రేమ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ అమ్మ ప్రేమకు జాతి వైరం లేదు ఈ భూ ప్రపంచంలో తల్లిదే మొదటిస్థానం ఆ తరువాతే భగవంతుడి స్థానం ఈ తల్లి ప్రేమకు పశుపక్షాదులు జంతువులు సైతం సృష్టి ధర్మాన్ని పాటిస్తున్నాయి.

అన్నీ తెలిసిన మనిషే నరరూప రాక్షసుడు గా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో మాటలు లేని జంతువుల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

అందుకు ఉదాహరణే ఈ తల్లి కోతి కథ పిల్లకోతి చనిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్న పిల్లకోతి బతికే ఉందనే నమ్మకంతో తన వెంటే తిప్పుకుంటున్న ఈ సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది.  వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పరిధిలోని ముల్కనూర్ పీహెచ్ సీ లో చోటుచేసుకుంది వానరమైన అమ్మే కదా బుడిబుడి అడుగులు వేస్తూ తల్లి వానరం వెంట తిరిగే పిల్ల వానరం చెట్టు పై నుంచి కింద పడి మృతి చెందింది.

మూడు రోజుల క్రితం మృతి చెందిన పిల్ల వానరాన్ని తల్లి వానరం వదలకుండా పొత్తిళ్ళలో పెట్టుకొని తిరుగుతూ తల్లి వానరం పడుతున్న ఆవేదనను బాధను బాధ్యతను చుట్టుపక్కల ప్రజలు చూసి నివ్వెరపోయారు.

also read :- ఖమ్మంలో టీఆర్ఎస్ ధర్నా..హాజరైనా మంత్రి, ఎంపీ, మాజీ ఎంపీ.