Telugu News

రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మద్యం దుకాణాలు.. ఎన్నంటే!

హైదరాబాద్‌: తెలంగాణలో నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌ శాఖ

0

రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మద్యం దుకాణాలు.. ఎన్నంటే!

హైదరాబాద్‌: తెలంగాణలో నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌ శాఖ

కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ నెలాఖరుకు ప్రస్తుతమున్న మద్యం పాలసీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి సంబంధించి కమిషనర్‌ అధికారులతో చర్చించారు. గత రెండేళ్ల మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. మరో 350కి పైగా పెరిగే అవకాశం ఉంది. దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంపై సమీక్షలో చర్చించినట్లు సమాచారం. ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడలకు 15శాతం రిజర్వేషన్లు కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తో్ంది. లైసెన్సు ఫీజు, దరఖాస్తు రుసుముల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది